Viral Video: భయం లేకుండా బ్లాక్ కోబ్రాకు నీరు తాగించిన వ్యక్తి..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.!!
King Cobra Drinking Water: హానికరమైన పాముల్లో బ్లాక్ కోబ్రా ఒకటి. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది.ఈ పాము కాటుకు గురైతే ఇంక అంతే సంగతి. బ్లాక్ కోబ్రాలు వాటికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్ల జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాయి.
King Cobra Drinking Water: హానికరమైన పాముల్లో బ్లాక్ కోబ్రా ఒకటి. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది.ఈ పాము కాటుకు గురైతే ఇంక అంతే సంగతి. బ్లాక్ కోబ్రాలు వాటికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్ల జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాయి. కోబ్రాలు వేడి, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి నెలల తరబడి ఆహారం, నీటిని తీసుకొకుండా జీవిస్తాయి. అయితే అధిక ఉష్టోగ్రతల కారణంగా కొన్ని పాములు ప్రజా సంచరంలోకి వచ్చి దాహం తీచర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో వారిపై ఎలాంటి దాడి చేయకుండా నీటిని తాగుతుండం విశేషం. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ఆఫ్రికాకు చెందిన ఓ కోబ్రా ప్రజల నుంచి తాగు నీరును స్వీకరించింది. అయితే ఓ వ్యక్తి నాగు పాముకు ఒక గ్లాసులో నీరు తాగించేందుకు సహాయం చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పచ్చని మైదానంలో కూర్చొని గాజు గ్లాసులో నీరును పాముకు తాగిస్తున్న సన్నివేశాలు మనం చూడోచ్చు. పాము గ్లాసు లోపల తన నోటిని తాగుతున్న దృశ్యాలను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను IFS అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో మరికొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేశారు. దీంతో పాటు బాతు పిల్లలు, ఓ కొతి పిల్ల కలిసి పుచ్చకాయ తింటున్న వీడియోను సుశాంత నందా పోస్ట్ చేశారు. ఆ వీడియోకు 23,000 పైగా వ్యూస్ వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook