North Korea: ఉత్తర కొరియాలో డేంజర్ బెల్స్... దేశంలో తొలి కోవిడ్ మరణం... 3.50 లక్షల మందిలో జ్వర లక్షణాలు..

North Korea First Covid Death:  ఉత్తర కొరియాను కరోనా వణికిస్తోంది. దేశంలో లక్షలాది మంది ప్రజలు జ్వర లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లు అసలు దేశంలో కోవిడ్ కేసులే లేవని చెప్పిన ఉత్తర కొరియా... ఇప్పుడు అధికారికంగా కోవిడ్ కేసులు, మరణాల వివరాలను ప్రకటిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 10:57 AM IST
  • ఉత్తర కొరియాను వణికిస్తోన్న కరోనా
  • లక్షలాది మందిలో జ్వర లక్షణాలు
  • దేశంలో కోవిడ్‌తో తొలి మరణం నమోదు
North Korea: ఉత్తర కొరియాలో డేంజర్ బెల్స్... దేశంలో తొలి కోవిడ్ మరణం... 3.50 లక్షల మందిలో జ్వర లక్షణాలు..

North Korea First Covid Death: ఉత్తర కొరియా అంటేనే ఒక మిస్టరీ దేశం. అక్కడ ఏం జరిగినా అధ్యక్షుడు కిమ్ ఆజ్ఞ లేనిదే ఆ వార్త బయటి ప్రపంచానికి చేరదు. కరోనా కాలంలో తమ దేశంలో ఒక్క కేసూ నమోదు కాలేదని బుకాయించిన కిమ్ ప్రభుత్వం... ఇటీవలి కాలంలో అధికారికంగా కోవిడ్ కేసుల వివరాలను ప్రకటిస్తుండటం గమనార్హం. దేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైందని ప్రకటించిన మరుసటిరోజే... కోవిడ్‌తో తొలి మరణం సంభవించినట్లుగా తాజాగా ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. 

కేసీఎన్ఏ రిపోర్ట్ ప్రకారం... ఉత్తర కొరియాలో జ్వరంతో బాధపడుతూ ఆరుగురు చనిపోగా... ఇందులో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మరో 1,87,000 మంది ప్రస్తుతం జ్వరంతో బాధపడుతుండగా... వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిజానికి ఉత్తర కొరియాలో చాలా కాలంగా వైరస్ వ్యాప్తి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నప్పటికీ... ఆ దేశం మాత్రం తమ వద్ద ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బుకాయిస్తూ వచ్చింది. దేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైనట్లు గురువారం (మే 12) అధికారికంగా ప్రకటించింది. ఇక ఇవాళ కోవిడ్‌తో తొలి మరణం నమోదైనట్లు వెల్లడించింది.

కరోనా విజృంభిస్తుండటంతో ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో లాక్‌డౌన్ విధించారు. జ్వరం కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నప్పటికీ... అవన్నీ కరోనా కేసులే అయి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయనే దానిపై ఇప్పటికైతే ఉత్తర కొరియా నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ప్యోంగ్యాంగ్‌తో పాటు ఉత్తర కొరియాలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వరం కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఉత్తర కొరియా చెబుతోంది. ఇప్పటివరకూ 3,50,000 మందిలో జ్వర లక్షణాలను గుర్తించినప్పటికీ... ఇందులో ఎంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలిందనేది వెల్లడించలేదు. ఉత్తర కొరియా చెబుతున్న వివరాల ప్రకారం.. మునుపెన్నడూ లేనంతగా అక్కడ కరోనా వ్యాప్తి ఉండొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా వద్ద కరోనా వ్యాక్సిన్లు కూడా లేకపోవడం.. దేశంలో హెల్త్ కేర్ వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండటంతో దేశ ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Karate Kalyani: యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌పై కరాటే కల్యాణి దాడి.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ... వీడియో వైరల్..

Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు... హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలివే...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News