Elephant Attacks: టూరిస్టులకు బిగ్ షాక్.. సఫారీట్రక్ ను ఎత్తిపాడేసిన ఏనుగు..వైరల్ వీడియో..
Elephant Attacks On Tourist: సౌత్ ఆఫ్రికాలోని సఫారీని చూడటానికి వెళ్లిన టూరిస్టులకు ఊహించని ఘటన ఎదురైంది. ట్రక్ లోపల కొందరు పర్యాటకులు అడవిలోని ఏనుగు దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Elephant Attacks On Tourist In South Africa Pilanesberg National Park: మనలో చాలా మంది సఫారీలు, నేషనల్ పార్కులకు ఫ్యామిలీ,ఫ్రెండ్స్ తో కలసి వెళ్తుంటారు. అక్కడ జంతువులు, వాతావరణంను చూసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సఫారీలలో సింహాలు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఉంటాయి. కొందరు వీటిని చూస్తు ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం.. వీటిపై రాళ్లు విసరడం, తినుబండారాలు విసరడం వంటివి చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఇంకాస్త అతిగా.. క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగడానికి చూస్తుంటారు. ఇలాంటి క్రమంలో అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే సఫారీలలో, జూలలో క్రూర జంతువుల ఎన్ క్లోజర్ లలో ప్రవేశించి రచ్చ చేసిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. అదే విధంగా.. కొన్నిసార్లు క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి సెల్ఫీల కోసం ప్రయత్నించినప్పుడు అవి దాడిచేసిన ఘటనలు కూడా అనేకం జరిగాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
సౌత్ ఆఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఇక్కడ కొందరు పర్యాటకులు అడవిలో ప్రత్యేకంగా ట్రక్ లో సఫారీ కోసం వెళ్లారు. జంతువులను దగ్గరగా చూడొచ్చని చాలా మంది టూరిస్టులు ఎంతో ఇంట్రెస్ట్ తో, ధైర్యంచేసి క్రూర జంతువులు ఉండే అడవిలో సఫారీకి వెళ్లారు. ఈక్రమంలోనే ట్రక్ లో ఏనుగు దగ్గరకు వెళ్లిన పర్యాటకులకు షాకింగ్ ఘటన ఎదురైంది. టూరిస్టులు ట్రక్ లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో వీరికి ఒక ఏనుగు కన్పించింది. వెంటనే దానితో కొందరు ఫోటోలు దిగాలని, మరికొందరు పోటోలు తీయడానికి ఆసక్తి చూపించారు. ఇంతలో ఏనుగు కెమెరాలో ఫ్లాష్ లైట్లకు బెదిరిందో.. ట్రక్ ను చూసి ఏమనుకుందో కానీ.. ఒక్కసారిగా గట్టిగా ఘీంకారం చేస్తూ.. టూరిస్టులు ప్రయాణిస్తున్న ట్రక్ ను తొండంతో పైకి ఎత్తింది.
అంతేకాకుండా.. గాల్లో ట్రక్ ను పైకి ఎత్తి పక్కకు నెట్టేయడానికి ప్రయత్నించింది. ఈ అనుకొని ఘటనతో టూరిస్టులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గట్టిగా అరుపులు, కేకలు పెట్టారు. ట్రక్ ను నడిపిస్తున్న డ్రైవర్ కూడా గట్టిగా అరుస్తూ ఏనుగు వెనక్కు వెళ్లేలా చేశారు. ఏనుగు కాస్తంత వెనక్కు తగ్గి, ట్రక్ ను కింద వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..
ఈ ఘటనను ఒక వ్యక్తి దూరం నుంచి వీడియో తీశాడు. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మరీ.. ఇలాంటి పనులు చేయోద్దని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ట్రక్ ను నడిపిన డ్రైవర్ ధైర్యానికి మెచ్చుకొవాల్సిందే నంటూ ..మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter