Viral Video: పెళ్లి ఊరేగింపులో `శ్రీవల్లి` ఫీవర్.. హుక్ స్టెప్‌తో ఊగిపోయిన యువకులు! రచ్చ మాములుగా లేదుగా!!
Funny dance on Pushpa Srivalli song in Wedding procession. తాజాగా ఓ పెళ్లి జరగగా.. ఊరేగింపులో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు 10-15 మంది యువకులు డాన్స్ చేశారు. హిందీలో సాంగ్ ప్లే అవుతుంటే.. యువకులు రోడ్డుపై స్టెప్పులు వేశారు.
Funny dance on Pushpa Srivalli song in Wedding procession: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది డిసెంబరు 17న విడుదలైన పుష్ప.. అన్ని భారతీయ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్, డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. ఇప్పటికీ పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప పాటలకు చిందులేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి ఊరేగింపులో యువత అల్లు అర్జున్ హుక్ స్టెప్‌తో ఊగిపోయారు.
తాజాగా ఓ పెళ్లి జరగగా.. ఊరేగింపులో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు 10-15 మంది యువకులు డాన్స్ చేశారు. హిందీలో సాంగ్ ప్లే అవుతుంటే.. యువకులు రోడ్డుపై స్టెప్పులు వేశారు. శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను వారు చేశారు. దాదాపుగా ప్రతిఒక్కరు మైమరచిపోయి హుక్ స్టెప్‌ను వెరైటీగా చేశారు. పక్కన వాహనాలు వెళుతున్నా కూడా వారు ఏమాత్రం తగ్గలేదు. యువత చేసిన హంగామాకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ఇందుకు సంబందించిన వీడియోను శివాజీ దూబే అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయబడింది. 'పెళ్లి ఊరేగింపులో పుష్ప ఫీవర్' అని కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'పుష్ప ఫీవర్ మాములుగా లేదు', 'ఫన్నీ హుక్ స్టెప్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల యూఏఈలో ఉంటున్న ఆర్థోడాంటిస్ట్ నివేదా శెట్టి హెగ్డే, ఆమె ఆరేళ్ల కుమార్తె ఇషాన్వి.. హిందీ వెర్షన్ శ్రీవల్లి పాటకు డాన్స్ చేశారు. తల్లీకూతుళ్లు ఇద్దరు లంగావోణీలో కూడా అదిరే స్టెప్పులు వేశారు. ఎక్కడ కూడా వారి స్టెప్పులు మిస్ మ్యాచ్ కాలేదు. చిన్నారి కూడా వావ్ అనిపించింది.తల్లీ కూతుళ్ల డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే.. అల్లు అర్జున్ కూడా వీళ్ల డ్యాన్స్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేడు.
Also Read: Ravindra Jadeja: సెంచరీ చేసిన జడేజా.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?!!
Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook