Ganesh pandal in muslim traditional costume in secunderabad: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ, పల్లె, పట్నం తేడాలేకుండా గణపయ్య విగ్రహానలు ప్రతిష్టించారు. భక్తితో పూజలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో కొంత మంది అత్యుత్సాహాం ప్రదర్శిస్తున్నారు.  ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా హీరోలు లేదా సినిమాల పేర్లు వచ్చేలా గణేష్ విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఇటీవల పుష్ప 2 మూవీ అల్లు అర్జున్ మాదిరిగా గణేష్ విగ్రహాంను తయారు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. ఇష్టమున్నట్లు వినాయకుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వినాయకుల విగ్రహాలపై  ఇటీవల సోషల్ మీడియాలో పెనుదుమారం నడుస్తోంది. ఈ క్రమంలో.. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఒక గణపయ్య ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజన్ లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 


పూర్తి వివరాలు..


హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణపయ్యను హైదరాబాద్ లో ఎంతో ఫెమస్ గా చెప్పుకొవచ్చు.ఈ క్రమంలో ప్రతి గల్లీలో కూడా స్పెషల్ గా మండపాలను ఏర్పాటు చేసుకుని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు.  ఈ క్రమంలో సికింద్రాబాద్ లోని.. యంగ్ లియోస్ యూత్ అసోషియేషన్ వారు కాస్తంతా అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరు ఏకంగా గణపయ్యకు ముస్లింల మాదిరిగా టోపీ పెట్టి, వారి డ్రెస్ ను ఉండేలా గణేష్ విగ్రహాం ప్రతిష్టించారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం వివాదానికి కారణమైంది. బాజీరావ్ మస్తానీ మూవీ థీమ్ తో దీన్ని తయారు చేశారంట.


ఈ గణపయ్యను చూసిన వారంతా.. యూత్ వారిని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం సరికాదని అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఒకర్నిమరోకరు గౌరవించుకొవడం కరెక్ట్. కానీ.. ఒకరి మనొభావాల్ని దెబ్బతీసేలా మరోకరు ప్రవర్తించకూడదని అక్కడున్న వారు చెప్తున్నారు. ఎవరి దైవంను వారు కొలుచుకుంటారు. కానీ ఇలా ఒకరి దైవం.. మరోకరి డ్రెస్ , టోపీలు ఉండేలా తయారు చేయడం ఎంత వరకు సమంజసం అంటున్నారు.


Read more: Vikarabad: నిమజ్జనం వేళ షాకింగ్.. ఫుల్లుగా తాగి గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్సై.. వీడియో..


అదే తాము.. మజ్జీత్ కు వెళ్లి.. అక్కడున్న వారికి బొట్టుపెడితే.. నమాజ్ చేసే ప్రదేశంలో..వారికి నచ్చని పనులు చేస్తే ఒప్పుకుంటారా.. అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మనం చేసే ఉత్సావాలు , కార్యక్రమాలు సోదరభావం కలిగేలా ఉండాలే కానీ.. గొడవలకు మాత్రం కారణం కాకుడదంటూ కూడా మరికొందరు తిట్టిపోస్తున్నారు.ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.