Vikarabad: నిమజ్జనం వేళ షాకింగ్.. ఫుల్లుగా తాగి గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్సై.. వీడియో..

Ganesh Immersion: వినాయక నిమజ్జనం వేళ ఒక ఎస్సై హల్ చల్ చేశాడు. ఏకంగా గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం వికారాబాద్ పరిధిలో వివాదాస్పదంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 16, 2024, 01:28 PM IST
  • పూడురులో రెచ్చిపోయిన ఎస్సై..
  • చిన్నపిల్లలతో వాగ్వాదం..
Vikarabad: నిమజ్జనం వేళ షాకింగ్.. ఫుల్లుగా తాగి గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్సై.. వీడియో..

Drunken si damagaed ganesh idol in vikarabad: దేశంలో ఘనంగా వినాయక నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎక్కడ చూసిన కూడా గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మండపాల నిర్వాహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక విగ్రహాన్ని ఎంతో భక్తిభావనలో ప్రతిష్టాపని చేసి పూజలు జరిపించారో..అంతే జాగ్రత్తగా.. నిమజ్జనం వేడుకను కూడా నిర్వహిస్తారు.

 

కొంత మంది వినాయకుల విగ్రహాలను ఊరేగింపు తీసుకెళ్లేటప్పుడు.. డీజేలు, బ్యాండ్ లను ఏర్పాటు చేస్తారు. మాస్ పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేసుకుంటూ ఊరేగింపు నిర్వహిస్తారు. మరికొందరు భక్తి పాటలు పెట్టుకుని భజనలు చేస్తు కూడా నిమజ్జనం కార్యక్రమం చేస్తారు. ఇదిలా ఉండగా.. వికారాబాద్ లో వినాయక నిజ్జనం వేడుకలో షాకింగ్ ఘటనచోటు చేసుకుంది. పూడురు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై హిందు సంఘాలు తమ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి.

పూర్తి వివరాలు..

వికారాబాద్ జిల్లాలోని పూడురులో వినాయక నిమజ్జనం వేళ గణపయ్యకు అపచారం జరిగిందని చెప్పుకొవచ్చు. ఒక పోలీసు తప్పతాగి వినాయకుడి విగ్రహాన్ని తాకడమే కాకుండా.. ఆ విగ్రహాం ధ్వంసం కావడానికి కూడా కారణమయ్యాడు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది. పూడురు మండలంలో కొంత మంది పిల్లలు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత తాజగా, గణేష్ నిమజ్జనంకు తీసుకెళ్తున్నారు. దీనిలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. పిల్లలు.. ట్రాలీలో గణపయ్య విగ్రహాంను పెట్టుకున్నారు. రెండు డీజీ బాక్స్ లను సైతం పెట్టుకున్నారు.

డ్యాన్సులు చేస్తు వినాయకుడ్ని తీసుకెళ్తున్నారు. ఇంతలో  ఒక ఎస్సై అక్కడికి వచ్చాడు.  చిన్న పిల్లలతో వాగ్వాదానికి దిగాడు. రోడ్డు మీదనే గణపతి విగ్రహాన్ని కిందకు దించాడు. దీంతో వినాయకుడి విగ్రహాం డ్యామేజ్ అయ్యింది. చిన్న పిల్లల్ని దుర్భాషాలాడుతూ.. తన ప్రతాపం చూపించాడు. ఈ నేపథ్యంలో కొంత మంది అక్కడికి చేరుకొగానే.. వారితో కూడా ఎస్సై జులం ప్రదర్శించాడు.  సదరు అధికారి తప్పతాగిఉన్నట్లు తెలుస్తొంది.

ఈ విషయంగ్రామస్థులకు తెలియడంతో వారంతా తరలివచ్చారు. ఈక్రమంలో ఈ ఘటన కాస్త సీఐ,డీఎస్పీ వరకు వెళ్లింది. వెంటనే వారంతాకూడా సంఘటన స్థలానికి వచ్చారు. గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. సీఐ శ్రీనివాస్..తన వాహానంలో.. వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు.

Read more: Viral video: ఓర్ని.. ఇదేక్కడి వింత.. చెప్పులు చోరీ చేస్తున్న పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

వివాదానికి కారణమైన ఎస్సై పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హమీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాగి హల్ చల్ చేసిన  ఎస్సై మధుసూదన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్కడి గ్రామస్థులు  శాంతించారు. ఈ ఘటన మాత్రం నిమజ్జన వేళ వివాదస్పదంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News