Viral Video: ఖడ్గమృగాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ముద్దాడుతోన్న అమ్మాయి.. షాక్ అవుతోన్న నెటిజెన్స్!
Girl Kisses Rhino, Viral Video: సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఫన్నీ వీడియోలు చూసినప్పుడు మనం తెగ ఎంజాయ్ చేస్తాయి. కానీ కొన్ని గగుర్పొడిచే వీడియోలు మాత్రం షాకింగ్‌కు గురి చేస్తాయి. అలాంటి వీడియోనే ఇది.
Rhinos Viral Video: సోషల్ మీడియాలో తరుచూ మనం చాలా షాకింగ్ వీడియోలను చూస్తూ ఉంటాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో ఒక అమ్మాయి మూడు ఖడ్గమృగాలతో సరదాగా గడపడం చూడొచ్చు. ఒక ఖడ్గమృగాన్ని (Rhino) తన ఒళ్లో పడుకోబెట్టుకుని దాన్ని ముద్దాడింది ఆమె. ఇక ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ 21 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ అమ్మాయి మూడు పెద్ద ఖడ్గమృగాల మధ్యలో అలా కూర్చొవడం.. వాటిని ముద్దాడడం మాత్రం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రైనోహూస్ అనే అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జనవరి 15న షేర్ అయిన ఈ వీడియోను కొందరు నెటిజెన్స్ (Netizens) లైక్ చేస్తుండగా.. మరికొందరు దీనిపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఏనుగు తర్వాత అంతటి శక్తింవంతమైన జంతువైన ఖడ్గమృగం ఇలా ఆటలాడడం సరికాదని కొందరు నెటిజెన్స్ అంటున్నారు. ఆ ఖడ్గమృగాలు కొమ్ములతో దాడి చేస్తూ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఆ ఖడ్గమృగం అంత ప్రశాంతంగా ఎలా ఉందబ్బా అంటూ ఒక నెటిజెన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఈ వీడియోపై పలు రకాలుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో (Video) సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది.
Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ సాంగ్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook