Google Trending Video: జూలో ఓ వ్యక్తిపై దాడి చేసిన సింహం.. చేతిని కొరికేసి..!

Google Trending Video: సింహం అడవిలో ఉన్నా.. బోనులో ఉన్నా.. దాని ప్రవర్తన ఏమాత్రం మారదు. ఓ జూలో బంధించి ఉన్న సింహం ఎదుట నిలబడి ఉన్న ఓ వ్యక్తిని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ సింహాన్ని సరదాగా తాకేందుకు అతడు ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నాన్ని గమనించిన సింహం ఆ వ్యక్తి చేతిని నోటితో పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 02:26 PM IST
    • సెనెగల్ లోని ఓ జూలో వ్యక్తిపై దాడిచేసిన సింహం
    • ఓ వ్యక్తి చేతిని నోటపెట్టుకొని బోనులోకి లాగిన లయన్
    • సింహాన్ని ముట్టుకునే క్రమంలో దాడి- వీడియో వైరల్
Google Trending Video: జూలో ఓ వ్యక్తిపై దాడి చేసిన సింహం.. చేతిని కొరికేసి..!

Google Trending Video: జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు ఇటీవలే సోషల్ వెబ్ సైట్లలో వైరల్ గా మారుతున్నాయి. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సహా ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ వీడియోలూ వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బోనులో ఉన్న సింహాన్ని రెచ్చగొట్టిన ఓ వ్యక్తి దాని ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అతడి చేతిని నోటిలో పెట్టుకొని అతడ్ని లోపలికి లాగింది. అయితే అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. 

ఏం జరిగిందంటే?

ఆఫ్రికా దేశంలో సెనెగల్ ప్రాంతానికి చెందిన ఓ జూ పార్కులో ఈ సంఘటన జరిగింది. జూలోని ఓ పంజరంలో ఉన్న సింహం ముందు ఓ వ్యక్తి నిల్చోని ఉన్నాడు. ఆ సమయంలో సింహం సైలెంట్ గా కూర్చొని ఉంది. అదే సమయంలో సింహాన్ని తాకేందుకు అతడు ప్రయత్నించాడు. అప్పుడు అతడ్ని గమనించిన సింహం వెంటనే ఆ వ్యక్తి చేతిని నోటికి తీసుకొని అతడ్ని లోపలికి లాగాలని ప్రయత్నించింది. అప్పుడు ప్రాణ భయంతో అతడు కేకలు వేశాడు. సింహాన్ని బెదరగొట్టేందుకు అక్కడున్న ప్రజలకు కూడా దానిపై రాల్లు రువ్వినా.. అది ఏ మాత్రం జంకలేదు. 

అయితే సింహం నుంచి తన చేతిని విడిపించుకునేందుకు ఆ వ్యక్తి తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, కొన్ని సెకన్ల తర్వాత అతడి చేతిని సింహం వదిలేసింది. దీంతో బతుకుజీవుడా అంటూ ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకుంటూ సింహం చెర నుంచి పక్కకు వచ్చాడు. అయితే ఈ ఘటనలో అతడి చేతికి తీవ్రగాయం అయ్యిందని తెలుస్తోంది. 

సోషల్ మీడియాలో ఈ వీడియోను  పోస్ట్ చేస్తూ.. “ఇలాంటి తప్పును ఇక మరెవరూ చేయరు” అనే క్యాప్షన్ ఇచ్చారు. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పుటి వరకు 63,335కు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం వల్ల ఇప్పుడు దానికి మరిన్ని వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోను చూసి కొందరు షాక్ కు గురవ్వగా.. మరికొంతమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!

Also Read: Strange sea creature: మత్స్యకారుడిని వెంటాడిన వింత సముద్ర జీవి- వీడియో వైరల్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News