Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..
![Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు.. Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2024/10/18/382069-cpr.jpg?itok=MpUKveuH)
Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gujarat man performing cpt to snake in vadodara: చాలా మంది పాముల్ని చూడగానే దూరంగా పారిపోతుంటారు. మరికొందరు మాత్రం.. పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీలకు సమాచారం ఇస్తారు. ఇంకొందరు.. పాములు కన్పించగానే కొట్టి చంపేస్తుంటారు. అడవులు, దట్టమైన చెట్లు, గుబురుగా చెట్లు ఉన్న ప్రదేశంలో పాములు ఎక్కువగా కన్పిస్తాయి. పాములకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని భయంకరంగా ఉంటాయి. మరికొన్ని మాత్రం షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి.
నెటిజన్ లు మాత్రం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కవగా ఆసక్తి చూపిస్తారు.ఈ నేపథ్యంలో పాములకు ఆపద కల్గిస్తే.. కాలసర్పదోషం చుట్టుకుంటుందని చెప్తుంటారు. అందుకే పండితులు మాత్రం పాములకు ఆపద కల్గించకూడదంటారు. పాములు పొలాల్లో, ఎలుకలు ఎక్కువగ ఉన్న చోట కన్పిస్తుంటాయి. అయితే.. పాములకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
చాలా మంది పాముల్ని చూసి భయపడి పారిపోతుంటారు. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం పాముల్ని చూసి భయపడి పారిపోలేదు. కదలకుండా ఉన్న స్థితిలో ఉన్న పాము దగ్గరకు వెళ్లాడు. అంతేకాకుండా.. దానికి సీపీఆర్ చేసి మరీదాని ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో చోటు చేసుకుంది. ఒక యువకుడు అపస్మార స్థితిలో ఉన్న పాముు చూశాడు. అంతేకాకుండా.. పాము దగ్గరకు వెళ్లి దాన్ని చేతితో కదిలించాడు. అప్పటికి అది అపస్మారక స్థితిలొ ఉంది. అప్పుడు దాన్ని ఎలాగైన కాపాడాలని అనుకున్నట్లు ఉన్నాడు.
ఇటీవల కాలంలో చాలా మంది గుండె పోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారు. అయితే.. కరెక్ట్ టైమ్ లో సీపీఆర్ చేస్తే.. సదరు వ్యక్తి ప్రాణాపాయం నుంచి బైటపడొచ్చంటారు. ఇక్కడకూడా సదరు యువకుడు.. అచ్చం అదే ట్రిక్ ను ప్లే చేశాడు. పామును తన చేతిలో తీసుకుని అచ్చం మనిషికి చేసినట్లు సీపీఆర్ చేశాడు. పాము నోట్లోకి తన నోటితో ఊపిరీ ఊదాడు. కాసేపటికి ఆ పాములో కదలికలు వచ్చాయి.
Read more: Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళ జుట్టులోకి దూరిపోయిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
ఆ తర్వాత ఆ పామును కింద పెట్టడంతో అది మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడున్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు, జంతు ప్రేమికులు మాత్రం సదరు యువకుడ్ని శభాష్ .. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.