hen bows down infront of lord jagannath idol video goes viral: సాధారణంగా చాలా మందికి దైవ భక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొవచ్చు. ఇటీవల కొంత మంది తరచుగా గుడిలోకి వెళ్తుంటారు. అంతేకాకుండా.. ఎక్కడ గుడి కన్పించిన, దేవుడి ప్రతిమ కన్పించిన వెంటనే దండం పెట్టుకుంటారు. ఇటీవల మనుషులే కాదు.. నోరులేనీ జీవాలకు సైతం భక్తి ఎక్కువైందని చెప్పుకొవచ్చు. ఇటీవల ఒక పిల్లి మహారాష్ట్రలో శనిసింగ్నపూర్ లో శనీ విగ్రహాం చుట్టు తిరుగుతూ హల్ చల్  చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతే కాకుండా..  మరోచోట కోతి ఆంజనేయ స్వామి విగ్రహాం దగ్గర కూడా గద పట్టుకుని పూజలు చేసింది. ఇలాంటి వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. నెటిజన్లు కూడా వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా, ఒక కోడి పుంజు జగన్నాథుడి ఆలయం దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.


పూర్తి వివరాలు..


ఒడిషాలో ఇటీవల ఒక వింతైన ఘటన చోటు చేసుకుందంట. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక కోడి జగన్నాథుడి ఆలయంకు వచ్చింది. అది జగన్నాథుడి ముందు తలను వంచి ప్రత్యేకంగా ప్రార్థనలు సైతం చేసింది. అక్కడున్న వారు.. చూస్తుంగానే.. కొద్ది సేపు ఈ కోడి అచ్చం మనుషుల్లాగానే.. స్పెషల్ గా ప్రార్థనలు చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.


Read more: Viral Video: ఓర్నీ.. ఇదేందీ భయ్యా.. వీధి కుక్కపాలు తాగిన యువతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..


దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారంట. మరోవైపు.. ఒడిషా ప్రజలు మాత్రం.. ఇది దైవమహిహే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారంట. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.