Leopard Attacks On Python: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవతున్నాయి. పాములు, పులులు, సింహాలు వంటి యానిమేల్స్ వీడియోలు (Animal Videos) నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా సింహాలు, పులులు, చిరుతపులులు వంటి జంతువులు పాములను వేటాడడం చాలా అరుదు. తాజాగా అలాంటి రేర్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ''నది ఒడ్డున చిరుతపులి (Leopard) నీళ్లు తాగుతూ ఉంటుంది. ఆ నీటిలో ఓ కొండ చిలువను చూస్తోంది. వెంటనే నోటితో దాని తోకను పట్టుకుంటుంది. ఇంతలో పాము (Python) సడన్ గా చిరుత కాలును కరుస్తుంది. దీంతో చిరుత కోపంతో కొండచిలువను నోటితో కరుచుకుని..పారిపోతుంది''. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 



ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ‘వైల్డ్ యానిమల్స్ క్రియేషన్’ అనే యూజర్ షేర్ చేశారు. ఇది ఇప్పుడు వేల సంఖ్యలో లైక్స్‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చిరుతకు పామును ఎలా పట్టుకోవాలో నేర్పించండి అంటూ ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. 


Also Read: Viral Videos: నీకో దండంరా సామీ.. అడవిలో నక్కనే కూర్చోబెట్టి మ్యూజిక్ వినిపించిన ఘనుడు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి