Fox enjoys Banjo Music in Forest: ఈ ప్రపంచంలో సంగీతంను ఆస్వాదించని మనిషి ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిఒక్కరు మూడ్ బాగున్నా లేదా బాగాలేకపోయినా మ్యూజిక్ విని రిలాక్స్ అవుతారు. మ్యూజిక్ వినడం ద్వారా చాలా ఒత్తిడి తగ్గుతుంది. సంగీతానికి కేవలం మనుషులే కాదు.. జంతువులు కూడా రియాక్ట్ అవుతుంటాయి. పెంపుడు జంతువులైన ఆవు, కుక్క, పిల్లి, కుందేలు లాంటివి సంగీతంను ఆస్వాదిస్తాయి. అయితే అడవిలో ఉండే ఓ నక్క కూడా మ్యూజిక్‌కు ఫిదా అయింది. ఓ వ్యక్తి మ్యూజిక్ ప్లే చేస్తుంటే.. ఆస్వాదించింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
అమెరికాలోని కొలరాడోలోని అడవుల్లో పగటి పూట ఓ వ్యక్తి బాంజో మ్యూజిక్ ప్లే చేశాడు. అతడు ప్లే చేస్తున్న మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఆ మ్యూజిక్ అక్కడే ఉన్న ఓ నక్కకి కూడా నచ్చింది. వెంటనే అది అతని ముందుకు వచ్చి కూర్చుని మ్యూజిక్ వినింది. చెవ్వులు నిక్కబొడుచుకుని మరీ బాంజో మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసింది. సదరు వ్యక్తి మ్యూజిక్ వాయించినంత సేపు అది అక్కడే ఉండి పరవశించి పోయింది.
కాసేపు అయ్యాక ఆ నక్క లేచి పక్కకు వెళ్లి మళ్లీ వచ్చింది. ఇంతలో వ్యక్తి ఓ 2-3 సెకన్ల పాటు బాంజో మ్యూజిక్ ఆపేశాడు. దాంతో ఏంటి ఆపేశావ్ అన్నట్టు ఆ నక్క అతడి వైపు చూసింది. ఇది గమనించిన ఆ వ్యక్తి మళ్లీ మ్యూజిక్ ప్లే చేశాడు. దాంతో మరికొంతసేపు ఆ చిలిపి నక్క మనోడి సంగీతంను ఆస్వాదించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నక్క చేష్టలకు ఫిదా అవుతున్నారు. 'నీకో దండంరా సామీ.. నక్కనే కూర్చోబెట్టి మ్యూజిక్ వినిపించావుగా' అంటూ మ్యూజిక్ ప్లే అతడిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియోని 'గుడ్ న్యూస్ డాగ్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. 'సంగీతం శక్తి ఇదే' అని కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకి ఇప్పటికే 1 కోటి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే లక్షల్లో కామెంట్స్, లైకుల వర్షం కురిసింది. ఈ నక్క మ్యూజిక్ ఆస్వాదించడం చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు సర్ మ్యూజిక్ ఆపేశారు, నక్కకు మంచి ఫుడ్ పెట్టావ్ అని రాసుకొచ్చారు. ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.
Also Read: IND vs WI: అరుదైన ఘనత సాధించిన భారత్.. అగ్రస్థానంలో మాత్రం పాకిస్తాన్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook