Viral Video: ఓ వార్తను చూపించేందుకు న్యూస్ రిపోర్టర్ తన వంతు కృషి చేస్తాడు. ఎంతటి శ్రమ అయినా ముందుకు వెళ్తుంటారు. ఈసందర్భంగా ఎదురయ్యే సవాళ్లను సైతం అధికమిస్తారు. తాజాగా అలాంటి ఘటననే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇటీవల అక్కడ భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. చెరువులు, నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ ఛానల్‌ రిపోర్టర్ వరదల గురించి మాక్‌లైవ్ చేశాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో దిగి మరి మాక్‌లైవ్ ఇచ్చాడు. కేవలం మెడ, మైక్‌ మాత్రమే కనిపిస్తోంది. అలానే ముందుకు వెళ్తూ మాక్‌లైవ్ ఇచ్చాడు. ఈవీడియోను అనురాగ్‌ అమితాబ్ అనే ఓ వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోను కొన్ని పేర్లతో ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రిపోర్టర్ చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి అంకిత భావాన్ని, పని తీరును ప్రశంసిస్తున్నారు. 



మరికొందరూ దీనిని తప్పుపడుతున్నారు. రిపోర్టర్లను ప్రమాదంలోకి నెట్టేలా న్యూస్ ఛానెళ్లు పనిచేస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకొందరూ ఇదంతా ఫేక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాక్‌లో వరదలు సంభవించాయి. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో జలవిలయాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.



Also read:వందల కోట్ల ఆస్తి.. రెండు పెళ్లిళ్లు.. నాగార్జున గురించి మీకు తెలియని విషయాలివే!


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి