Landslides Falling on Roads : కార్లు వెళ్తున్న రోడ్డుపై కుప్పకూలిన కొండచరియలు.. వీడియో వైరల్
Viral Video Of Landslides Falling on Roads in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అలా విరిగిపడుతున్న కొండచరియలు కొండలను ఆనుకుని ఉన్న రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి.
Viral Video Of Landslides Falling on Roads in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో రహదారులు సైతం కొండలను ఆనుకునే ఉండటంతో ఎత్తైన కొండలపై నుండి జారిపడిన కొండచరియల నుంచి వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఒక రహదారిపై కొండచరియలు విరిగిపడిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఏంటంటే.. కొండచరియలు విరిగిపడిన సమయంలోనే అదే రోడ్డుపై కార్లు కూడా వెళ్తుండటమే. అవును ఈ వీడియోను గమనిస్తే... కొండపక్కనే కొండను ఆనుకుని ఉన్న బిజీ రోడ్డుపై కొన్ని వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో కొండను చూస్తే అది కదులుతున్నట్టుగా అనిపించింది. దీంతో రోడ్డుకి ఇవతల కొండకు దూరంగా నిలబడిన వారు గట్టిగా అరుస్తూ అటుగా వస్తున్న కార్లను రావొద్దంటూ హెచ్చరికలు జారీచేయసాగారు.
అయితే, కార్లలో వెళ్తున్న వారిలో కొంతమందికి వీరి అరుపులు వినిపించడం లేదు. వీళ్ల కేకలు విన్న వారు కారును వేగంగా ముందుకు పోనిచ్చి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.
ఇది కూడా చదవండి : Anaconda Snake Chasing Boy : బాలుడి వెంటపడిన భారీ సైజ్ ఆనకొండ పాము.. ఈ వైరల్ వీడియో నిజమేనా ?
కార్లు అలా ముందుకు వెళ్లాయో లేదో వెంటనే పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాయి. అంత పెద్ద రాళ్లు, అంత ఎత్తు నుంచి వచ్చి కార్లపై పడితే.. కార్లు నుజ్జునుజ్జు అవడం ఖాయం. అందుకే ఆ కార్లలో ప్రయాణిస్తున్న వాళ్లు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి కనుకే వాళ్లు అంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బట్ట కట్టగలిగారు అంటున్నారు ఈ వైరల్ వీడియో చూసిన నెటిజెన్స్.
ఇది కూడా చదవండి : Man Died of Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో రైల్వే గేటు వద్ద చిక్కుకుపోయిన అంబులెన్స్ !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK