Cheetah Hunting Its Prey: చిరుత పులి వేగంగా పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా ? మరీ ముఖ్యంగా చిరుత పులి ఏదైనా జంతువును వేటాడుతున్నప్పుడు దాని వేగం ఏ రేంజులో ఉంటుందో గమనించారా ?  నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వీడియోల్లోనో లేక యూట్యూబ్ వీడియోల్లోనో చూసే ఉంటారు కానీ అవేవీ కూడా ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోకు సాటిరావు. తుపాకీలోంచి బయటికొచ్చిన బుల్లెట్‌లా ఆహారాన్ని వేటాడుతూ స్పీడ్‌గా దూసుకెళ్తున్న చిరుత పులి.. అంత హై స్పీడ్‌లోనూ తన ముందున్న జంతువును దాటేసి సడెన్ బ్రేకేసినట్టుగా ఆగిపోయిన తీరు అద్భుతం అనిపించకమానదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తను వేటాడుతున్న జంతువును దాటేసి.. తన చేతుల్లోకే ఆ జంతువు వచ్చేలా ఎదురునిలబడి.. ఆ జంతువు తప్పించుకోకుండా ఒడిసి పట్టుకున్న తీరు చూస్తే.. ఎవ్వరికైనా గూస్ బంప్స్ రాకమానవు. చిరుతపులి వేటాడే తీరు చూసి నెటిజెన్స్ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కసారి చూస్తే తనివి తీరనట్టుగా ఉన్న ఈ వైరల్ వీడియోను నెటిజెన్స్ మళ్లీ మళ్లీ వీక్షిస్తున్నారు. 



 


చిరుతపులి కేవలం 3 సెకన్ల వ్యవధిలోనే గంటకు 100 కిమీ వేగం పరుగెత్తగలదు. అలా వేగంగా పరుగెత్తే క్రమంలో చిరుతపులి ఒక్కో అడుగు 7 నుంచి 8 మీటర్ల దూరం వేస్తుంది. ఈ వీడియో చూస్తోంటే దట్టమైన అడవిలో షూట్ చేశారని అనిపిస్తోంది కానీ.. ఏ అడవిలో షూట్ చేశారు, ఎప్పుడు చిత్రీకరించారు అనే వివరాలు అందుబాటులో లేవు. ఈ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. ట్విటర్ లో పోస్ట్ అయిన తరువాత ఒక్క రోజులోనే 2.43 లక్షల వ్యూస్ రాగా 3000 లకు పైగా రిట్వీట్స్ వచ్చాయి.


ఇది కూడా చదవండి : Muslim Couple Married in Temple: దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి.. ఫోటోలు, వీడియోలు వైరల్


ఇది కూడా చదవండి : Friendship Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఆ లెవెలే వేరు కదా.. వైరల్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook