Muslim Couple Married in Temple: దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి.. ఫోటోలు, వీడియోలు వైరల్

Muslim Couple Got Married in Hindu Temple : ఈ నిఖా తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.  

Written by - Pavan | Last Updated : Mar 6, 2023, 09:03 PM IST
Muslim Couple Married in Temple: దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి.. ఫోటోలు, వీడియోలు వైరల్

Muslim Couple Got Married in Hindu Temple : హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం జంట హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. షిమ్లాలోని రాంపూర్‌లో.. అది కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న దేవాలయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఆదివారం ఈ నిఖా వేడుక జరిగింది. హిందూ దేవాలయంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లిం జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    

రాంపూర్‌లో ఉన్న థాకూర్ సత్యనారాయణ్ దేవాలయంలోని పూజలు, గుడి నిర్వహణ బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోంది. ఈ పెళ్లి వేడుకకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పెళ్లి కోసం కేవలం రెండు ముస్లిం కుటుంబాలు మాత్రమే ఆలయానికి రాలేదు.. ఈ పెళ్లి తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.

దేవాలయం ఆవరణలో మౌల్వి, న్యాయవాది, సాక్షులు ఈ నిఖాను దగ్గరుండి జరిపించారు. హిందూ, ముస్లిం సోదర భావంతో మెలగాలి అనే సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సదుద్దేశంతోనే ఇలా హిందూ దేవాలయంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నట్టు రెండు కుటుంబాలు తెలిపాయి. వధూవరులు ఇద్దరూ వృత్తిరీత్యా ఇంజనీర్లే. ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబాలు కావడంతో ఆ ఇరు కుటుంబాలు ఏకాభిప్రాయానికి రావడం సులువైంది.

షిమ్లాలోని సత్యనారాయణ్ మందిరం విశ్వ హిందూ పరిషద్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సంస్థలకు జిల్లా ప్రధాన కార్యాలయంగా కొనసాగుతుండటం విశేషం. మత సామరస్యం వెల్లివిరిసేలా.. భారతదేశం బహు సంస్కృతులకు నిలయం అని చాటిచెప్పేలా.. ఇక్కడ దేవాలయంలో నిఖా చేసుకునేందుకు ఇస్లాం కుటుంబాలు ముందుకు రావడం ఒక గొప్ప విషయం కాగా... వారి విజ్ఞప్తిని సహృదయంతో అర్థం చేసుకుని వారికి ఆలయ ప్రవేశం కల్పించిన విశ్వ హిందూ పరిషద్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సంస్థలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇది కూడా చదవండి : Friendship Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఆ లెవెలే వేరు కదా.. వైరల్ వీడియో 

ఇది కూడా చదవండి : Govt Jobs 2023: కేవలం రూ. 4950 ఇస్తే రూ. 29000 జీతం వచ్చే సర్కారు నౌకరి రెడీ.. నిజమేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

ఇది కూడా చదవండి : 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x