ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉంటే స్పందించడం మానవత్వం. అంటే జాలీ, దయ, ప్రేమ, కరుణ, ఎదుటివాళ్ల కష్టాలకు స్పందించడం. ఈ లక్షణాలు జంతువుల్లో ఉండవు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే జంతువులకు కూడా జాలి ఉంటుంది అని మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక కుక్క తన మంచి మనసును ప్రపంచం ముందు చూపించి.. చూడండి నా మంచి మనసు అని  చెప్పకనే చెబుతోంది.



వైరల్ వీడియోలో ( Viral Video ) ఒక కుక్క స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటుంది. అయితే అందులో మిడుత ( Locust ) ఉండటాన్ని గమనించిన కుక్క.. వెంటనే దాన్ని కాపాటానికి ప్రయత్నిస్తుంది. తన నోటితో మిడుతను తీసుకుని ఒడ్డున తీసుకొచ్చి దాని ప్రాణం కాపాడుతుంది.



ఈ వీడియోలో కుక్క జాలి మనసును నెటిజెన్స్ ( Netizens) విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా షేర్ అవుతోంది ఈ వీడియో.