Donkey Viral Video: ప్రతి జీవికీ సహనం ఉంటుంది. ప్రతి జీవికీ కోపం కూడా వస్తుంది. నోరులేని జీవికదా అని ఇష్టమొచ్చినట్టు చేస్తే ఇలాగే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొన్ని జంతువులంటే మనం భయపడతాం. మరికొన్ని జంతువులంటే చేరదీస్తాం. ఇంకొన్ని జంతువులతో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తుంటాం. నోరులేని జీవి అని కూడా చూడకుండా అడ్డమైన బరువులు మోయిస్తుంటాం. పాపం ఏం చేస్తుంది..అలా భరిస్తుంటుంది. వీపున ఎంత బరువేసినా మోస్తూ ఉంటుంది. అందుకే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయనే విషయం చెప్పినప్పుడు గాడిదతో పోలుస్తుంటారు పెద్దలు. 


ఇక్కడే కాదు ఎక్కడైనా గాడిదను బరువు మోసే జంతువుగానే చూస్తుంటారు. అంత బరువు మోస్తున్నా కనీసం గాడిదపై కనికరం చూపించరు జనం. అలాంటి వ్యక్తే ఈ వీడియోలో కన్పిస్తున్నాడు గాడిదను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు కొడుతూ ఉన్నాడు. కాళ్లతో ముఖంపై తన్నడం, చేతులతో ముఖంపై గుద్దడం, లెంపకాయలేయడం ఇలా చాలా చాలా దారుణంగానే వ్యవహరించాడు. ఈ వీడియో చూస్తుంటే మనకైనా కోపమొస్తుంది ఆ వ్యక్తిపై. అత్యంత కిరాతకంగా కొట్టడమే కాకుండా..చివరికి గాడిదెక్కి స్వారీ చేయాలని కూర్చున్నాడు..అప్పుడేమైందంటే...


అంతే కోపమనేది ఎవరికైనా వస్తుంది. ఎంత సహనజీవికైనా సరే. ఎందుకంటే దేనికైనా పరిధి అనేది ఉంటుంది. పరిధి దాటితే మొదటికే మోసమొస్తుంది. ఆ విషయాన్ని ఈ వ్యక్తి మర్చిపోయాడు. ఇలా మీదెక్కి కూర్చున్నాడో లేడో..గాడిదకు ప్రతీకారం తీర్చుకోవాలన్పించింది. ఏ కాలితో తన్నాడో..ఆ కాలిని నోట కర్చి..గట్టిగా పట్టుకుంది. చుట్టూ తిప్పుతూ కిందేసి పడేసింది. కొద్దిదూరం ఈడ్చేసింది. నోట కర్చిన కాలిని మాత్రం వదల్లేదు.



ఈ వీడియో ఇప్పుడు చాలా వేగంగా వైరల్ అవుతోంది. అంతేకాదు..ఆ వ్యక్తిని దారుణంగా తిడుతున్నారు. మంచి శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను..ఈవెన్ ది నైసెస్ట్ డాంకీ పేషెన్స్ హ్యాస్ ఎ లిమిట్ అనే క్యాప్షన్‌తో ధరణిరెడ్డి అనే అమ్మాయి పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి కాలికి తీవ్రమైన గాయమే అయినట్టు కన్పిస్తోంది. కోలుకోవాలంటే చాలా రోజులు పట్టవచ్చు. 


Also read: Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో కుదించుకుపోయిన నేల, 43 అడుగుల లోతులో పడిపోయిన వ్యక్తి, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.