Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో కుదించుకుపోయిన నేల, 43 అడుగుల లోతులో పడిపోయిన వ్యక్తి, వీడియో వైరల్

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక భయం గొలిపే వీడియో వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్‌లోని సింక్‌హోల్‌లో జరిగిన ప్రమాదం మొత్తం అందర్నీ భయభ్రాంతులకు లోనుచేసింది. వీడియో చూస్తూ షాక్ అవుతున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2022, 04:29 PM IST
Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో కుదించుకుపోయిన నేల, 43 అడుగుల లోతులో పడిపోయిన వ్యక్తి, వీడియో వైరల్

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక భయం గొలిపే వీడియో వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్‌లోని సింక్‌హోల్‌లో జరిగిన ప్రమాదం మొత్తం అందర్నీ భయభ్రాంతులకు లోనుచేసింది. వీడియో చూస్తూ షాక్ అవుతున్నారు. 

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆసక్తి రేపితే, మరికొన్ని వీడియోలు భయం రేపుతుంటాయి. ఇంకొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇదే కోవలోకి వస్తుంది కొత్తగా వైరల్ అవుతున్న వీడియో. ఈ వీడియో ఇజ్రాయిల్ దేశానికి చెందిందిగా తెలుస్తోంది. ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఓ పార్టీ నడుస్తోంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పూల్‌లో స్నానాలు చేస్తుంటే..మరికొంత మంది ఆటలాడుతున్నారు. అంతలో ఒక్కసారిగా జరిగిన ఆ ఘటన అందర్నీ భయభ్రాంతులకు లోనుచేసింది. 

ఇజ్రాయిల్‌లోని ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఏర్పడిన సింక్‌హోల్ అందర్నీ భయకంపితుల్ని చేసింది. సాధారణంగా వర్షాకాలం రోజుల్లో రోడ్డు కుంచించుకుపోవడం చూస్తూనే ఉంటాం. అదే విధంగా స్విమ్మింగ్ పూల్‌లో జరిగింది. ఉన్నట్టుండి ఆ పూల్‌లో ఓ సింక్‌హోల్ ఏర్పడి..అందులో ఓ వ్యక్తి పడిపోతాడు. ఆ సింక్‌హోల్ కూడా ఏకంగా 43 అడుగుల లోతులో ఏర్పడింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోతాడు. పూల్ ఫ్లోర్ విరిగిపోయి..నీరంతా ఆ సింక్‌హోల్‌లో వేగంగా పోతుంది. నీళ్లతో పాటు పూల్‌లో స్విమ్మింగ్ ‌ఉపయోగించే ట్యూబ్స్ అన్నీ లోపలకు కొట్టుకుపోతాయి.

సింక్‌హోల్ ఎలా ఏర్పడిందనేది ఇంకా తెలియలేదు. కానీ నేల దిగువభాగం..గ్రౌండ్ వాటర్ కారణంగా కరిగిపోతే అక్కడున్న భూభాగం అలాగే లోపలకు కుంచించుకుపోతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే వైరల్ అవడం ప్రారంభించింది. ఈ ఘటన ఇజ్రాయిల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో జరిగింది.

Also read: Viral Video: ఐదవ ఫ్లోర్ నుంచి జారి పడిన చిన్నారి, సూపర్‌మేన్‌లా దూసుకొచ్చి చిన్నారిని క్యాచ్ పట్టిన వ్యక్తి,

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News