పిల్లలు పిల్లలే. ఆటలు ఆడటం, సరదాగా ఉండటం అంటే పిల్లలకు ఇష్టం. మనుషులకే కాదు.. జంతువుల పిల్లలకు కూడా ఆటలంటే ఇష్టం. ముఖ్యంగా ఏనుగు పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టం. అడవిలో ఏనుగుల కుటుంబం మొత్తం కలిసి నది లేదా నీటి గుంట దగ్గరికి వెళ్తుంటే చిన్నారి ఏనుగులు ( Elephant ) చాలా ఎక్సైట్ అవుతాయి. ఎందుకంటే వాటికి తెలుసు. నీటిలో ఆడటం అంటే చాలా సరదాగా ఉండే విషయం అని.. నీటిలోకి వెళ్లగానే చిన్నారి ఏనుగులు చాలా సంతోషపడతాయి.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    నటి గరిమా సేన్ అందాల ఫోటోలు

  • నటి గుంజన్ అరాస్ సూపర్ హాట్ ఫోటోలు


ఈ వీడియోలో ( Viral Video ) కూడా ఒక చిన్నారి ఏనుగు శివాని తన నామకరణ దినోత్సవం సందర్భంగా ఇలా హల్చల్ చేసింది.  దక్షిణ కర్నాటకలోని  ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామీనాథ గుడిలో ఈ చిన్నారికి నామకరణం జరుగుతున్న సమయంలో చిన్న వాటర్ పూల్ లో ఆడుతూ సందడి చేసింది. శివాని 2020 జులైలో జన్మించింది. శివానీకి నీటితో ఆడటం అంటే చాలా ఇష్టం అని అధికారులు తెలిపారు.