Girl Dances To Pathaan Song: షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా తెరకెక్కిన పఠాన్ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఈ పాట ఎంత వివాదం అయిందో.. సినిమా విడుదల తరువాత అంత వైరల్ అయింది. జూమే జో పఠాన్ అంటూ సాగిన ఈ పాటకు దీపికా పదుకునె తన డాన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసింది. పఠాన్ చిత్ర నిర్మాణ సంస్థ డిసెంబర్ 22న యూట్యూబ్ లో విడుదల చేసిన జూమే జో పఠాన్ పాటకు 330 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆ పాటకు ఎంత భారీ క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పఠాన్ పాటకు తాజాగా ఓ అమ్మాయి పార్కులో డాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా భారీ స్పందన కనిపిస్తోంది. అచ్చం దీపికా పదుకునె తరహాలోనే మెలికలు తిరుగుతూ అమ్మాయి చేసిన డాన్స్ కి నెటిజెన్స్ ఫిదా అయ్యారు. చూడ్డానికి అచ్చం దీపికా పదుకునె - 2 లా ఉందే అంటూ యువతిపై కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు. నమ్మలేకపోతే మీరే మీ కళ్లతో స్వయంగా చూడండి. యువతి డాన్స్ ఎంత లవ్లీగా ఉందో మీకే అర్థం అవుతుంది. 



 


చూశారు కదా యువతి డాన్స్.. ఆ నడుం ఒంపులు.. హోయలు.. మెలికలు తిరుగుతున్న నాజూకైన శరీరం దీపికా పదుకునెకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది కదూ.. కాకపోతే దీపికా పదుకునె అందరికీ ఎప్పుడో సుపరిచితమైన హీరోయిన్ కాగా.. ఈ యువతి ఇప్పుడే అందరి కళ్లలో పడింది. అమ్మాయి తన డాన్స్ తో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్న తీరు చూస్తోంటే.. ఆమెకు సినిమాల్లో ఛాన్స్ రావడానికి ఎక్కువ సమయం పట్టదని అనిపిస్తోంది. ఎందుకంటే.. అమ్మాయికి డాన్స్ తో పాటు గ్లామర్ కూడా ఉండటం మరో ప్లస్ పాయింట్. గ్లామర్ ప్లస్ టాలెంట్ కలిస్తే ఛాన్స్ దానంతట అదే వస్తుందని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలా పఠాన్ మూవీ టైటిల్ సాంగ్‌కి డాన్స్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న అమ్మాయిల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా మారింది. 


ఇది కూడా చదవండి : Viral Video: కారు క్రాష్ టెస్ట్ ఇలా చేస్తారా ? హై స్పీడ్ యాక్సిడెంట్స్ వైరల్ వీడియో


ఇది కూడా చదవండి : King Cobra Viral Video: కింగ్ కోబ్రా.. పడగ విప్పి పైపైకొస్తున్నా.. అతడు మాత్రం కూల్ బేబీ అంటున్నాడు చూడండి


ఇది కూడా చదవండి : Shocking Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. వెళ్లి చూస్తే ఆశ్చర్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook