Pathaan Movie Collections: కేజీఎఫ్ 2, బాహుబలి 2 ను దాటేసిన పఠాన్ సినిమా కలెక్షన్లు

Pathaan Movie Collections: షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కొత్త రికార్డులు సాధిస్తోంది. ఇండియాలో 200 కోట్లు కలెక్షన్లతో కేజీఎఫ్ 2, బాహుబలి 2ను దాటేసింది. పఠాన్ సినిమా కలెక్షన్ల వివరాలు, రికార్డులు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2023, 01:52 PM IST
Pathaan Movie Collections: కేజీఎఫ్ 2, బాహుబలి 2 ను దాటేసిన పఠాన్ సినిమా కలెక్షన్లు

బాలీవుడ్ లేటెస్ట్ సినిమా పఠాన్‌తో షారుఖ్ ఖాన్ భారీ హిట్ ఇచ్చాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ విజ్యువల్ అద్భుతం అన్ని విమర్శలకు సమాధానం చెప్పేసింది. బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డు సృష్టిస్తోంది. 

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందుతున్న ప్రాధమిక నివేదికలు, ట్రేడ్ నివేదికల ఆధారంగా పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు దాటగా, ఇండియాలో 200 కోట్లు దాటేసింది. ఈ అంకెలు నిజంగానే ఓ రికార్డు. 

ఇండియాలో కేజీఎఫ్ 2, బాహుబలి 2 కలెక్షన్లను దాటడం ద్వారా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది. ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పఠాన్ సినిమా కలెక్షన్ వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్‌లో చేరిందని..కేజీఎఫ్ 2, బాహుబలి 2లను ఓవర్‌టేక్ చేసిందని ట్వీట్ చేశాడు. పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇంకా అద్భుతమైన కలెక్షన్లు వసూలవుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా షారుఖ్ ఖాన్ పెద్దఎత్తున అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు.

హిందీ సినిమా చరిత్రలో తొలిరోజే 55 కోట్ల నెట్ కలెక్షన్లతో కొత్త రికార్డు సృష్టించింది పఠాన్ సినిమా. తొలిరోజు పఠాన్ సినిమా కలెక్షన్లు 57 కోట్లుగా ఉంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం వంటి దిగ్గజ నటీనటులతో విడుదలైన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయోత్సవం జరుపుకుంటోంది. 

Also read: Taraka Ratna Health Latest Update: తారకరత్నకు అరుదైన వ్యాధి..ఆరోగ్యం పై బాల కృష్ణ, శివరాజ్ కుమార్ ప్రకటన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News