Fish Pond Cafe Viral Video: "ఫిష్ పాండ్ కేఫ్" అంటేనే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా..!! కానీ ఇది నిజమండి బాబు.. ఒక రెస్టారెంట్ లో నేలపై రంగు రంగుల చేపలు ఈదుతూ ఉంటే వాటి మధ్య కూర్చొని భోజనం చేయాలి.. ఏంటి ఇంకా నమ్మట్లేదా.. ? అయితే పదండి మీకు ఏకంగా వీడియో చూపిస్తాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 సెకన్ల క్లిప్‌ని సోషల్ మీడియాలో యూసర్ రెడ్డిట్‌లో  వీడియోని పోస్ట్ చేసాడు.. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన ఈ వీడియో కాస్త సమయంలోనే తెగ వైరల్ అవ్వగా... , 'టాంక్‌లో అతిథులు కూర్చున్న కోయి పాండ్ కేఫ్' అనే శీర్షికతో పోస్ట్ చేసారు. 


Also Read: Heavy rains in AP: భారీవర్షాల కారణంగా APలో 100 అడుగుల ముందుకొచ్చిన సముద్రం


చేపల మధ్య కూర్చుని తినటం... 
క్లిప్‌లో చూపినట్లుగా... ఒక గదిలో కుర్చీలు మరియు బల్లలు ఉంచబడ్డాయి, అందులో చెక్కతో చేసిన ఫ్లోర్ పై పాదం మునిగేంత లోతు వరకు నీళ్లు నింపారు. ఇక ఆ నీటిలో అనేక రంగుల చేపలు ఈత కొట్టడం కూడా మీరు చూడవచ్చు. ఈ ఫ్లోర్ మొత్తం చేపల తొట్టిలో తయారు చేసిన కారణంగా...  ఇది చాలా మందిని ఆకర్షిస్తుంది. గోడపై స్వీట్ ఫిష్ కేఫ్ (Sweet Fish Cafe) అని బోర్డు ఉన్నప్పటికీ ఈ కేఫ్ ఎక్కడుందో పక్కాగా తెలియదు. వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే.. ప్రజలందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫిష్-ట్యాంక్ రెస్టారెంట్ (Fish Tank Restaurant) గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. 



రెడ్డీట్‌లో షేర్ అయిన వీడియో... 
రెడ్డీట్‌లో (Reddit) షేర్ చేయబడిన ఈ వీడియో తెగ వైరల్ అవటంతో... నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ఒక యూసర్ "ఇది భయంకరమైన ఆలోచన" అని కామెంట్ చేయగా.. మరో యూసర్.. "ఆహారాన్ని నీటిలో వేస్తే అది చేపలకు విషపూరితం మారొచ్చు" అని కామెంట్ చేయగా.. 'ఈ చెరువు వల్ల కేఫ్‌లో కరెంటు సమస్య రావచ్చునని' మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోని ఇది r/Damnthatsinteresting అనే పేజీలో షేర్ చేయగా.. చేసిన కాసేపటికే 23 వేల వ్యూస్ రావటం మరో  విశేషం. 


Also Read: Rape Threat to Vamika: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook