Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. చెన్నైకి (Chennai) తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఇవాళ ఉదయం మరింతగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపింది.
అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా మారి.. ఆ తరువాత తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Aslo Read: Rape Threat to Vamika: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్
ఈ అల్పపీడనం కారణంగా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూడా వర్షపాతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే! ఆంధ్రాలో (Andhra) కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. భారీ వర్షాల కారణంగా.. గూడూరు- పంబలేరు (Guduru- Pambaleru) వాగుకు వర్షపు నీరు చేరగా.. జాతీయ రహదారి నిర్మాణం నిలిచిపోవటమే కాకూండా.. విజయవాడ-చైన్నై (Vijayawada-Chennai) రహదారి కూడా మూత పడనున్నట్లు తెలుస్తుంది.
Heavy rains in TIRUPATI
Huge wind 💨… branches falling down …
Scary situation on ground…
AP government will LIFT hands … national disaster relief management should STEP in … #TirupatiRains
— Naidu - Bhushan (@Bhushansz) November 11, 2021
భారీ వర్షాల కారణంగా.. తిరుపతిలో (Tirupathi) చెట్లు, స్తంబాలు నేలమట్టగం అవ్వగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.. అంతేకాకూండా నెల్లూరులో (Nellore) భారీ వర్షాల కారణంగా.. జన జీవనం ఎక్కడిక్కడే స్తంభించి పోయింది. భారీ వర్షాల కారణంగా.. ఏపీలోని స్వర్ణముఖి బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరగా.. కావాలి వద్ద సముద్రం 100 అడుగుల ముందుకువచ్చింది. అంతేకాకుండా సముద్రం నుండి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసినాడుతున్నాయి. ఫలితంగా దాదాపు 40 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Aslo Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook