Viral Video: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బలియా జిల్లా పిఫ్రాలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులతో ప్రిన్సిపాల్ టాయిలెట్లు శుభ్రం చేయించాడు. అక్కడే పక్కన నిలబడి పిల్లల చేత బలవంతంగా కడిగించాడు. మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయకపోతే చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశాడు. క్లీన్‌గా చేయకపోతే మరుగుదొడ్డిలో ఉంచి తాళం వేస్తానని..మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి వస్తుందని బెదిరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో భయపడ్డ విద్యార్థులు..టాయిలెట్లను శుభ్రం చేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని ఫోన్లో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో విద్యార్థులకు ప్రిన్సిపాల్ హుకుం జారీ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఇటు టాయిలెట్లను విద్యార్థులు శుభ్రం చేస్తుండటం స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇది కాస్త వివాదాస్పదం కావడంతో విద్యా శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణకు ఆదేశిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత పాఠశాల ప్రిన్సపాల్‌పై చర్యలు తప్పవన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. 



Also read:Jharkhand: లోదుస్తుల కోసం ఢిల్లీకి వెళ్లా..సీఎం హేమంత్ సోరెన్ సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు..!


Also read:Amit Shah: మొన్న ప్రధాని మోదీ..నిన్న హోంమంత్రి అమిత్‌షా..నేతల టూర్‌ల్లో భద్రతా వైఫల్యాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి