Jharkhand: లోదుస్తుల కోసం ఢిల్లీకి వెళ్లా..సీఎం హేమంత్ సోరెన్ సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Jharkhand: జార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

Written by - Alla Swamy | Last Updated : Sep 8, 2022, 04:25 PM IST
  • ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు
  • విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం హేమంత్ సోరెన్
  • తాజాగా సోరెన్ సోదరుడు వివాదాస్పద వ్యాఖ్యలు
Jharkhand: లోదుస్తుల కోసం ఢిల్లీకి వెళ్లా..సీఎం హేమంత్ సోరెన్ సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Jharkhand: జార్ఖండ్‌లో మహా డ్రామా కొనసాగుతోంది. ఇటీవల సీఎం హేమంత్‌ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈక్రమంలోనే ఆయన సోదరుడు బసంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించే దుమ్కా నియోజకవర్గంలో ఇటీవల దారుణ ఘటనలు చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య ఘటనపై తీవ్ర దుమారం రేగింది. దీంతో బసంత్ సోరెన్‌ను మీడియా ప్రతినిదులు పలు ప్రశ్నలు సంధించారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత బసంత్ సోరెన్ మృతుల కుటుంబాలకు పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. ఈసమయంలో మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈప్రశ్నకు సహనం కోల్పోయిన బసంత్ సోరెన్..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వద్ద లోదుస్తులు అయిపోయాయని..అందుకే వాటిని తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లానని బదులు ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయంగా అస్థిరమైన పరిస్థితులున్నాయన్నారు.

ఐనా పరిస్థితి చేయి దాటిపోలేదని తెలిపారు. సోరెన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇలా మాట్లాడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. జేఎంఎం పార్టీ అధ్యక్షుడు శిబు సోరెన్ తనయుడు లోదుస్తులు కొనుగోలు కోసం ఢిల్లీకి వెళ్లారని..అందుకే బాధితులకు పరామర్శించలేకపోయారంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు జార్ఖండ్ పాలిటిక్స్ ఉత్కంఠను రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్‌ శాసన సభ్యత్వంపై వేటు పడబోతోందని ప్రచారం జరుగుతోంది. 

దీంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది. సీఎం హోదాలో ఉండి తనకు తాను ఓ గని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గవర్నర్, ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో తన నిర్ణయాన్ని గవర్నర్‌కు ఈసీ పంపింది. దీంతో గవర్నర్ రమేష్‌ బస్ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇటు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. ఐతే ఎమ్మెల్యే పదవిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం కూలకుండా హేమంత్ సోరెన్ చర్యలు తీసుకుంటున్నారు.

Also read:RJ Surya Caste issue: సూర్య మన కులపోడే.. ఓటేసి గెలిపించండి!

Also read:Ganesh Immersion 2022: గణేష్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం..ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News