Viral Video: చాలా చోట్ల ఇంట్లోకి పాములు రావడం సహజంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆ పాములు ఇంట్లో వాళ్లకి సడెన్​గా కనిపించి షాకిస్తుంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఇటీవల అస్ట్రేలియాలోని క్వీన్స్​ ల్యాండ్​లో చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఏమైందంటే.. 


క్వీన్స్​ ల్యాండ్​లోని సన్​షైన్ కోస్ట్​లో గ్లెన్​వ్యూ అనే గ్రామీణ ప్రాంతంలో ఓ మిహళ నివసిస్తోంది. రాత్రి పడుకున్న తర్వాత కిచెన్​లోంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలకు మేలుకున్న ఆమె.. ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారని భావించింది. దీనితో లైట్లు ఆన్​ చేసి కిచెన్​లోకి వెళ్లి చూస్తే.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆ మహిళ షాక్​గు గురైంది. ఎవరో దొంగ పడ్డారనుకున్న ఆమెకు అంతకన్నా భయంకరమైన షాక్​ తగిలింది.


ఓ భారీ కొండచిలువ అమెకు అక్కడ దర్శనమిచ్చింది. దాని ఆకారం, సైజు చూసి ఒక్కసారిగా బయపడిపోయింది ఆ మహిళ. అంతలోనే తేరుకుని.. సన్​షైన్ కోస్ట్​ స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేసి విషయం చెప్పింది.


కొద్ది సేపటికి అక్కడకు చేరుకున్న స్నేక్​ స్నాచర్లు.. ఆ కొండచిలువను పట్టుకోవడాన్ని వీడియో తీసి ఫేస్​బుక్​లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసినవారంతా.. వామ్మె అంత పెద్ద పాము ఇంట్లోకి దూరిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. హమ్మయ్యా ఆ పాము ఎవరికీ హాని చేయలేదని స్పందిస్తున్నారు.


ఇదిలా ఉండగా.. స్నేక్ క్యాచర్స్​ మాత్రం ఇదే తమకు కొత్త కాదని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అడవుల దగ్గరగా ఉన్నకారణంగా ఇళ్లల్లోకి కొండచిలువలు సహా వివిధ రకాల పాములు వస్తుంటాయని.. ఫిర్యాదులు అందితే తాము అక్కడకు చేరుకుని వాటిని పట్టుకుంటామని అంటున్నారు. ఏది ఏమైన.. పాములు బయట కనిపిస్తేనే భయపడే వాళ్లకు.. ఇంట్లోనే పాము కనిపిస్తే ఎంత భయమేస్తుందో కదా. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ పాము వీడియోను మీరు చూసేయండి.



Also read: Parental Supervision: మీ పిల్లలు ఇన్‌స్టా వాడుతున్నారా..? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోండి!


Also read: Road Melting: ఎండ వేడికి కరిగి పొగలు కక్కుతున్న తార్​ రోడ్డు- వైరల్ వీడియో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook