Road Melting: ఎండాకాలం వచ్చేసింది. ఆరంభ దశలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈసారి గతంతో పోలిస్తే ఎండలు కాస్త ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాధి రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని చెప్పింది
వాతావరణ శాఖ అంచనాల చెప్పినట్లుగానే.. ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఎండలు అప్పుడే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఈసారి ఎండ తీవ్రత ఎంతుందో చెప్పే ఓ వీడయో ఇప్పుడు వైరల్‌గా మారింది.
925 ఏ జాతీయ రహదారిపై ఎండ వేడి కారణంగా తార్ రోడ్డు కరిగిపోతోంది. ఎండ తీవ్రతకు రోడ్డు పొగలు కక్కుతోంది. చితల్వానా సమీపంలో పాక్ బార్డర్‌కు దగ్గర్లో ఉండే కుంకీ గ్రామం దగ్గర.. రోడ్డు పొగలు కక్కుతున్న దృష్యాలు కనిపించపాయి. అటుగా వెళ్తున్న ఓ ఔత్సాహికుడు ఈ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీనితో ఈ దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి వాహనదారులను భయపెడుతున్న ఆ దృష్యాలను మీరూ చూసేయండి.
Also read: Aadhaar History: మీ ఆధార్ కార్డు అక్రమంగా వినియోగమవుతుందా? తెలుసుకోండిలా..
Also read: Viral Video: కదులుతున్న ఆటో ట్రాలీ నుంచి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook