10 Feet King Cobra Hiding Under Car: ప్రస్తుతం విష సర్పాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు పాములను పట్టుకునే స్నేక్ క్యాచర్స్ షేర్ చేసిన వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే స్నేక్ క్యాచెస్ కూడా వారు పెద్ద పెద్ద పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ యూట్యూబ్లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంత వైరల్ కావడానికి కారణాలేంటో.. అసలు ఆ వీడియోలో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో వివరాల్లోకి వెళితే.. కారు కింది భాగమైన బంపర్ లో పాము ఉండడం గమనించి.. కారు యజమాని స్నేక్ క్యాచర్కు సమాచారం అందిస్తాడు. దీంతో స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకొని కారు కింది దాగివున్న పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ భారీ కింగ్ కోబ్రా బుసలి కొడుతూ కాటేసే ప్రయత్నం కూడా చేస్తుంది. స్నేక్ క్యాచర్ తన స్టిక్ ని వినియోగించి ఎంతో చాకచక్యంగా పట్టుకుంటాడు. ఇలా పట్టుకున్న తర్వాత ఓ నల్ల బ్యాగులో ఆ భారీ కింగ్ కోబ్రా ను బంధిస్తాడు.  ఆ తర్వాత ఈ పామును సురక్షితమైన ప్రాంతంలో స్నేక్ క్యాచర్ వదిలేస్తాడు.



ముఖ్యంగా కార్లను అడవి, కొండ ప్రాంతాల్లో పార్క్ చేసినప్పుడు తప్పకుండా కారును చెక్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలే అడవి ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లలో చాలావరకు విష సర్పాలు బంపర్ల కింద ఎక్కడో ఒకచోట దాగివున్న వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేశారని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా అడవి ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీ కారు బంపర్లో, కార్లో కానీ తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


పాములను పట్టుకునేందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. లేకపోతే అవి కాటేసే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం చాలామంది స్నేక్ క్యాచర్స్ భూమిపై ఉన్న విష సర్పాలను రక్షించేందుకు తమ వంతు కృషిగా జనజీవన స్రవంతిలో సంచారం చేసే పాములను పట్టుకొని సురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదిలేస్తున్నారు.  పెద్ద పెద్ద సర్పాలను రక్షించే వారిని గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వీడియోను లివింగ్ జూలోజి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను ఐదు లక్షలకు పైగా మంది వీక్షించారు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook