Viral video: బాప్ రే.. కదులుతున్న ట్రైన్ లో పదడుగుల పాము హల్ చల్.. బెదిరిపోయిన ప్రయాణికులు.. ఎక్కడంటే..?
Snake in found in train: జబల్‌పుర్-ముంబయి గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో పాము రచ్చ చేసింది. ఏసీ కోచ్ లో పదడుగుల పాము బైటపడింది. అది సీటు మీద అటూ ఇటు వెళ్లడంను ప్రయాణికులు గమనించారు.
Snake found in running Jabalpur mumbai train in video viral: అడవులు, గుట్టలు,కొండ ప్రదేశాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు తరచుగా వస్తుంటాయి. పొలాలు, దట్టమైన చెట్లు ఉన్న చోటు కూడా పాములు బైటపడుతుంటాయి. ఈ క్రమంలో పాములు కన్పించగానే కొందరు స్నేక్ సొసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం.. పాములు కన్పిస్తే చంపేస్తుంటారు. పాములకు హానీ తలపెడితే.. కాలసర్పదోషం వస్తుందని కూడా చెప్తుంటారు. అందుకే పాముల్ని అస్సలు అపకారం చేయోద్దని పండితులు చెబుతుంటారు.
పాములకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని వీడియోలు చూసేందుకు భయంగా ఉంటాయి. అంతేకాకుండా.. పాములకు చెందిన ఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒక పాము ఏకంగా ట్రైన్ లోకి ప్రవేశించి, ప్రయాణికుల్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మన దేశంలో ఇప్పటికి కూడా చాలా మంది లాంగ్ జర్నీల కోసం ట్రైన్ లను ఉపయోగిస్తుంటారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పటికే నడుస్తున్నాయి. మరోవైపు, బుల్లెట్ ట్రైన్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక రైల్వేలలో ఇంకా మెరుగైన ఫెసిలీటీస్ తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో.. కదులుతున్న ట్రైన్ లో ఒక పాము హల్ చల్ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్.. ముంబయి నగరాల మధ్య గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ నడుస్తు ఉంటుంది. ఈ క్రమంలో.. ట్రైన్ .. కాసర రైల్వే స్టేషన్ కు వచ్చింది. అప్పుడు.. జీ3 భోగీలో కొంత మంది పామును చూశారు. వెంటనే భయంతో వణికిపోతు.. అక్కడి ప్రయాణికుల్ని అలర్ట్ చేశారు.
అక్కడి అప్పర్ బెర్త్ ను చుట్టుకుని పాము కాసేపటి వరకు అక్కడ ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు టీటీకీ సమాచారం ఇచ్చారు. ఆయన రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పామును బైటకు వదిలేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.