Telangana Viral Video: మరో ప్రాణాన్ని కాపాండేందుకు.. ప్రాణాలకు తెగించిన తెలంగాణ హోంగార్డు!
Telangana Home Guard Viral Video: తెలంగాణ పోలీసులు మానవత్వం చూపిస్తూ ఇతరులకు సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి... తెలంగాణ పోలీసులు మానవతా దృక్పథానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి వీడియోనే.
Telangana Police Viral Video: పోలీసులు నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారో.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా ముందుంటారు. ఎన్నో సందర్భాల్లో పోలీసులు తాము ఉన్నామంటూ భరోసా ఇస్తుంటారు పోలీసులు. (Police) తాజాగా తెలంగాణకు చెందిన హోంగార్డు చేసిన సాహసం.. ఆయ చేసిన సాయానికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. తెలంగాణకు (Telangana) చెందిన హోంగార్డు వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ చెట్ల పొదల్లో చిక్కుకున్న ఒక కుక్కను రక్షించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఉధృతంగా ప్రవహించే వరద నీటిలో చిక్కుకుపోయిన కుక్కను రక్షించేందుకు హోంగార్డు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ అనే హోంగార్డు (Home Guard) ఒక కుక్కను రక్షించడానికి ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో పెద్ద సాహసమే చేశారు.
జేసీబీ ఎక్స్‌కవేటర్ సాయంతో దాన్ని గట్టిగా పట్టుకుని.. ఆ కుక్కను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ముజీబ్. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా ఈ ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది.
Also Read: Rashmika Mandanna: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్ ఇచ్చాడుగా!!
వరదలో చిక్కుకున్న కుక్కను (Dog) కాపాండేందుకు హోంగార్డు ముజీబ్ పెద్ద సాహసమే చేశాడంటూ ఐపీఎస్ దీపాంషు కబ్రా పేర్కొన్నారు. ఆయన హృదయపూర్వక అభిందనలు... ఖాకీ డ్రెస్ వేసుకున్న వ్యక్తి.. (Police) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకాడరంటూ కబ్రా పేర్కొన్నారు.
Also Read: England Cricket Team: ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మొయిన్ అలీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook