Roaches Recipe Viral Video Watch Here: తరచుగా సోషల్ మీడియాలో అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని జంతువులకు సంబంధించినవి ఉంటే మరికొన్ని ఆహార పదార్థాలు జీవనశైలికి సంబంధించిన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. చాలావరకు సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ రీల్, వింత వింత వంటకాలకు సంబంధించిన వీడియోలు తరచుగా చూస్తూ ఉంటాం. ఇందులో చాలావరకు జనాలకు నచ్చిన వీడియోలే ఉంటాయి. కానీ ఇందులో భాగంగా అప్పుడప్పుడు వైరల్ అయ్యే కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అంతేకాకుండా ఛీ దీనమ్మ జీవితం అనిపించేలా ఉంటాయి.  ఇలాంటి వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా ఇలాంటి ఆహార రెసిపీలు కూడా ఉంటాయని అంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో? ఇంత వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఒక్కొక్క దేశ ప్రజలు ఒక్కొక్క ఆహారపు అలవాటు ఉంటుంది. కొంతమంది దేశ ప్రజలు పచ్చి ఆహారాన్ని తింటే మరి కొంతమంది దేశ ప్రజలు ఏమాత్రం నూనెతో లేని ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇక కొన్ని దేశాల్లో నైతే కేవలం పండ్లను మాత్రం తిని జీవిస్తూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో మాత్రం పాములు బొద్దింకలు, ఇతర జంతువులను తిని జీవిస్తూ ఉంటారు. అయితే ప్రపంచం ఒకటైనప్పటికీ మనుషులు అలవాటు చేసుకున్న ఆహార విధానాలు వేరు. ఇందులో భాగంగానే థాయిలాండ్ దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ఓ ఆహార రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా అక్కడి దేశ ప్రజలు పచ్చి ఆహారాలను తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో భాగంగానే కొంతమంది బొద్దింకలు ఇతర బ్రతికున్న జంతువులను కూడా తింటూ ఉంటారు. 






ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బొద్దింకలతో తయారు చేస్తున్న రెసిపీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఆ వ్యక్తి ఒక పెద్ద బౌల్లో జీవించి ఉన్న బొద్దింకలలో కోడిగుడ్లను వేస్తూ వాటిని బాగా మ్యాగ్నెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా మిశ్రమంలో కలుపుతున్న సమయంలో బొద్దింకలు అటు ఇటు పారిపోవడం మీరు గమనించొచ్చు. అంతేకాదండోయ్ ఇలా అన్నింటినీ కలిపిన బొద్దింకలను వేడి వేడి నూనెలో వేసి బాగా వేయించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా వాటిపై ఉల్లికాడ, వివిధ ఆకులతో గార్నిష్ చేయడం కూడా చూడొచ్చు. చివరగా బొద్దింకలు బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా తినడం చూసి నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా బొద్దింకలు కూడా తింటారా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను @foodiechina అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఇది థాయిలాండ్ ఫుడ్ అయినప్పటికీ.. చైనా దేశాల ప్రజలు కూడా బొద్దింకలను తినే అలవాటు ఉందని, చాలా ప్రదేశాల్లో ఈ బొద్దింకల ఫ్రై ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించగా.. 9,000 మందికి పైగా నేటిజన్స్ లైక్ చేశారు. ఇక కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook