Viral Video Today: ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. పాములతో విన్యాసాలు, స్నేక్ క్యాచింగ్ వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వీడియోలో పాము నోట్ల కట్టను తీసుకుని వెళుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో @lindaikejiblogofficial అనే వినియోగదారుడు పోస్ట్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 27న షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 16 వేల కంటే ఎక్కువ లైక్‌లు, కామెంట్స్‌ వచ్చారు. అంతేకాదు ఈ పాము వీడియోను తెగ షేర్ చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ఈ విచిత్రమైన సంఘటన జింబాబ్వేలో జరిగిందని తెలిపారు. కొండచిలువ జారిపోయే ఇంటిని "జిరా రెరెట్సో" అని పిలిచే ఒక గుడ్డతో అలంకరించినట్లు తెలిపారు. ఈ వస్త్రం ఆఫ్రికన్ సాంప్రదాయ మతాలలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వీకుల ఆరాధనతో సంబంధం కలిగి ఉంటుంది. దాని యజమానిని రక్షించే, శక్తివంతం చేసే ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారని రాసుకొచ్చారు. 


ఈ వీడియో ప్రామాణికతపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. కొంతమంది నిజామా..? కదా..? అని ప్రశ్నిస్తున్నారు. తెలివిగా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. "పాము మన డబ్బును దొంగిలించడాన్ని చూడండి" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఆఖరికి దొంగ పామును డబ్బుతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని అంటున్నారు. "పాములు డబ్బు ఇవ్వవు. అవి మింగుతాయి." అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. "ఆ వ్యక్తి డబ్బును దొంగిలించడానికి ప్రయత్నించి.. పామును దారి మళ్లింపుగా పంపి ఉంటాడు" అని చెప్పాడు. "ఈ వీడియో నకిలీ అయి ఉండవచ్చు. నాకు తెలిసి నోట్ల కట్ట పాముకి అతికించి ఉండవచ్చు" మరో వ్యక్తి కామెంట్స్ చేశాడు. మొత్తానికి పాము డబ్బులు తీసుకువెళుతున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.


 




 


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  


 


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook