Viral Video, Vultures gathered for ugent Meeting at Mid Road: ప్రతిరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించినవే ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా రాబందులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే వాటి మీటింగ్ జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ ట్విట్టర్ యూసర్ తాజాగా రాబందుల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో నడిరోడ్డుపైన రాబందుల గుంపు గుమిగూడి ఉంది. దాదాపుగా 10 రాబందులు వీడియోలో మనం చూడవచ్చు. వీడియో చూస్తుంటే.. రాబందులు అన్ని ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ కోసం అక్కడికి వచ్చినట్లు ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చుసిన అందరూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'సమావేశంలో వేటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి', 'నడిరోడ్డుపై రాబందుల ఎమర్జెన్సీ మీటింగ్', 'దేనికో మూడింది పో' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 


రాబందుల గుంపుకు సంబందించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 'అత్యవసర విషయాలపై ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది' అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేలకు పైగా మంది వీక్షించగా.. 3,600 మందికి పైగా లైక్ చేశారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసి కామెంట్ చేయండి. 



పక్షుల్లో అత్యంత తెలివైనవి, ప్రమాదకరనమైని రాబందులు. గాలిలో ఎంతో ఎత్తులో విహరిస్తూ భూమిపై ఉన్న జంతువులు, పాములు, చేపలు లాంటి వాటిని వేటాడుతుంటాయి. అంతేకాదు కళేబరాలను గుర్తించి ఆహారంగా తీసుకుంటాయి. గత దశాబ్దంలో రాబందుల సంఖ్య 90 శాతానికి పైగా తగ్గిందని గణాంకాలు చెపుతున్నాయి. విషపూరితమైన కళేబరాలు తినడంతోనే వాటి సంఖ్య ఘననీయంగా  తగ్గుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి.


Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!


Also Read: Samantha: సమంతకు షాక్.. పుష్ప-2లో బాలీవుడ్ భామకు అవకాశం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook