Woman Catching Snake Video Viral: పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వాటిని పట్టేవారు కూడా వాటి కాటుకు బలవుతారు. విషపూరితమైన పాములను పట్టుకోవడం అయితే కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వీటి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా సోషల్ మీడియాలో (Social Media) ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి విషపూరితమైన పామును పట్టుకుని కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్..ఆమె ధైర్యాన్ని, సాహాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన బ్రెజిల్ (Brazil)లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే...నడిరోడ్డుపై పాము కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. అటుగా వెళ్లే వారు పామును చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మొదట, ఆమె పాము వైపు కొన్ని క్షణాలు తదేకంగా చూస్తుంది. తర్వాత సిగరెట్ వెలిగించి.. ఒక పఫ్ ఊదుతుంది. అనంతరం పాము వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మాయి అకస్మాత్తుగా పామును తన చేతులతో  పట్టుకుని..పక్కనే ఉన్న పొలాల్లో వదిలేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో (Snake Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను unilad అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేశారు. మీరు చూసేయండి మరి. 



 


Also Read: Video: డ్రాగన్ స్నేక్... ఒళ్లంతా నాచు... నెట్టింట వైరల్ అవుతోన్న వింత పాము..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook