Video: డ్రాగన్ స్నేక్... ఒళ్లంతా నాచు... నెట్టింట వైరల్ అవుతోన్న వింత పాము..

Bizarre Snake Video: సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌కి చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తి ఈ పామును గుర్తించాడు. తన ఇంటికి కొద్ది దూరంలోని ఓ నీటి మడుగులో దీని గుర్తించినట్లు చెప్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 01:30 PM IST
  • థాయిలాండ్‌లో వింత పాము
  • ఒళ్లంతా నాచుతో కూడిన పాము
  • డ్రాగన్ స్నేక్ అంటున్న నెటిజన్లు
Video: డ్రాగన్ స్నేక్... ఒళ్లంతా నాచు... నెట్టింట వైరల్ అవుతోన్న వింత పాము..

Bizarre Snake Video: ఆకుపచ్చ రంగులో.. ఒళ్లంతా నాచు లాంటి వెంట్రుకలతో.. చూసేందుకు వింతగా ఉన్న ఓ పాము నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో ఈ పామును గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌కి చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తి ఈ పామును గుర్తించాడు. తన ఇంటికి కొద్ది దూరంలోని ఓ నీటి మడుగులో దీని గుర్తించినట్లు చెప్పాడు. చూడటానికి చాలా వింతగా ఉండటంతో దాన్ని ఒక జాడిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతని కుటుంబ సభ్యులు ఆ పామును చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని జాడి నుంచి తీసి.. నీళ్లు పోసిన ఒక పాత్రలో వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

సాధారణంగా పాముల శరీరంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు. కానీ ఈ పాము ఒంటి నిండా నాచు లాంటి వెంట్రుకలు ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోపై స్పందించిన ఓ నెటిజన్.. 'బహుశా ఆ పాము ఏదైనా నీటి పైపులో చాలాకాలం చిక్కుకుపోయి ఉంటుంది. అందుకే దాని శరీరంపై ఇలా నాచు మొలిచింది. దాని కారణంగా అది చాలా ఇబ్బంది పడుతుండొచ్చు.' అని కామెంట్ చేశాడు. కొంతమంది నెటిజన్లు దీన్ని డ్రాగన్ స్నేక్ అని కామెంట్ చేస్తుండటం గమనార్హం.

Also Read: Dr Subhash Chandra's Interview: జీ డిజిటల్‌కి 1 బిలియన్ యూజర్స్, వియాన్‌కి 500 మిలియన్ల వ్యూయర్స్, రుణాలు, డిష్ టీవి-యస్ బ్యాంక్ వివాదంపై డా సుభాష్ చంద్రతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Also Read: TS budget sessions 2022: అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News