Viral Video: కలకత్తా లోకల్ ట్రైన్లో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
Kolkata Local Train Viral Video: ఇటీవలే సోషల్ మీడియాలో ట్రైన్లో జరిగిన సంఘటనలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు కొంతమంది స్త్రీలు చెప్పులతో దాడికి దిగిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Kolkata Local Train Fight Video: గత కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రో కు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ ఆయన సంగతి తెలిసిందే. ఈ వైరల్ అయిన వీడియోలో లవర్స్ రొమాన్స్ చేసుకున్నవే ఎక్కువగా ఉండడం విశేషం. ఇటీవలే ఢిల్లీ మెట్రోలో ఓ గ్యాంగ్ ఒకరికొకరు కొట్టుకోవడం సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై మెట్రో అధికారులు కూడా స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రయాణికులే పలు జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు. అయితే ఈరోజు కలకత్తా లోకల్ ట్రైన్ లో జరిగిన సంఘటన నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ లోకల్ ట్రైన్ లో ఏం జరిగిందో? ఇంత వైరల్ అవ్వడానికి కారణాలేంటో? మనం ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే..మహిళలు చిన్నగా పెట్టుకున్న గొడవలే పెద్దగా మారుతూ ఉంటాయి. ఈ కలకత్తా లోకల్ ట్రైన్ లో కూడా ఇదే జరిగింది. ఇద్దరు స్త్రీలు చిన్నగా గొడవపడ్డారు.. ఈ వివాదం కాస్త దాడికి దారి తీసింది. వారిద్దరూ అరుస్తూ ఒకరికొకరు కొట్టుకోవడం మీరు వీడియోలో గమనించవచ్చు. ఇంతలోనే ఆ బోగీలో ఉన్న మహిళలంతా ఒకరికొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. అంతేకాకుండా ఒకరికొకరు చెప్పులతో చెంపలు చెల్లుమనిపించుకున్నారు.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
ఆ భోగిలో ప్రయాణిస్తున్న కొంతమంది వీరు కొట్టుకోవడం చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోలో వచ్చే సారీ కట్టుకున్న ఆంటీ చెప్పులు విసురుతున్న మహిళను పట్టుకొని సీట్లో కూర్చోబెట్టి పిడికిలి బిగించి మరి కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుందో అర్థమే కాలేదట. దాదాపు 20 నిమిషాల పాటు ఇలా ఒక్కరికొకరు చెప్పులు విసురుకున్నారని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఈ గొడవకు సంబంధించిన అసలు కారణమేంటో ఇప్పటికీ తెలియలేదు.
ఈ వీడియోను ఆయుషి అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటికీ 18 వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా నేటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిసారి అని కొందరు అంటే.. అదే లోకల్ ట్రైన్ లో రోజు ప్రయాణించేవారు ఇలా అంటున్నారు..'మేము ఆఫీస్ కి వెళ్లే క్రమంలో ఇలాంటి సంఘటనలు తరచుగా చూడడమే కాకుండా ఎదుర్కొంటామని' సోనియా సింగ్ అన్నారు.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి