House Collapses in River: అకస్మాత్తుగా కురిసే వర్షాలు లోతట్టు ప్రాంతాల వారికి నరకప్రాయంగా మారతాయి. ముఖ్యంగా నదులు, కాలువల వెంట నివాసం ఉండే ప్రాంతాలలో అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము. వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయి నదిలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిహార్ రాష్ట్రంలో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తూర్పు చంపార‌న్ జిల్లాలోనూ పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. చంపారన్ జిల్లా కేంద్రం మోతిహరిలో ఓ ఇల్లు వర్షానికి కూలిపోయింది. వర్షాల కారణంగా బురి గండక్ నదికి ప్రవాహం అధికమైంది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మోతిహరిలోని భ‌వానీపూర్ ఏరియాలో భూమి కోతకు గురైంది. ఓ ఇల్లు  క్షణాల వ్యవధిలో కూలిపోయి నదిలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ (Viral Video) అవుతోంది. జాతీయ మీడియా ఏఎన్ఐ సైతం ఈ వీడియో వివరాలు షేర్ చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook