Viral Video: సూపర్ బామ్మ, మనవడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నానమ్మ

GrandMother Video | కొందరు తల్లిదండ్రులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు చిన్నారులు, యువతీయువకులు వయసు మీద పడిన బామ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంటారు.  నానమ్మను ప్రాంక్ చేయబోతే ఆమె ఇచ్చిన రిప్లయ్‌(Prank Video)తో మనవడు షాకయ్యాడు.

Written by - Shankar Dukanam | Last Updated : May 7, 2021, 03:16 PM IST
Viral Video: సూపర్ బామ్మ, మనవడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నానమ్మ

అసలే కరోనా కాలం.. పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి చేస్తుంటారు. కొందరు తల్లిదండ్రులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు చిన్నారులు, యువతీయువకులు వయసు మీద పడిన బామ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో వారి పప్పులు ఉడుకుతాయి. కానీ అన్ని ఇళ్లల్లో ఇలాంటివి కుదరవు. నానమ్మను ప్రాంక్ చేయబోతే ఆమె ఇచ్చిన రిప్లయ్‌తో మనవడు షాకయ్యాడు. బామ్మతో అంత ఈజీ కాదని తేలిపోయింది.

ఓ యువకుడు హాయిగా సేదతీరుతున్న తన నానమ్మ వద్దకు వెళ్లాడు. నేను మీ మనవడినని తెలుసు కదా అని అడిగాడు. అందుకు ఆ బామ్మ ఆ తెలుసు అయితే ఏం చేయమంటావ్ అని మనవడికి గట్టిగానే బదులిచ్చింది. ఇది నా ఇల్లు, మా నాన్న దీన్ని కట్టించాడు తెలుసా అని నానమ్మను ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నానమ్మ సమాధానం విని కంగుతిన్నాడు. ఇది నా ఇల్లు, నేను కట్టించిన ఇల్లు ఇది. మీ నాన్న ఆ తరువాత ఇంటికి వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావో అక్కడికి వెళ్లు అంటూ బామ్మ తన మనవడికి చురకలు అంటించారు.

Also Read: Photos: 95 అడుగుల లోతు Borewellలో పడినా ప్రాణాలతో బయటపడ్డ బాలుడు

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by vibhor sharma (@vibhorfitnesss)

ప్రొఫెషనల్ ట్రైనర్ విభోర్ శర్మ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మై దాదీ, డాడీ లవ్, దాదీ, దాదీ ప్రాంక్ వీడియో అని ట్యాగ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. సూపర్ బామ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు. మా నానమ్మ కూడా ఇలాగే ఉంటారని స్పందిస్తున్నారు. ఆ వీడియోకు దాదాపు లక్ష వరకు లైక్స్ వచ్చాయి.

Also Read: WhatsApp Privacy Policy: వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News