Viral Video of Wood Sorrel Plant: ఈ అనంత విశ్వంలో, ప్రకృతిలో ఇప్పటికీ మనుషులకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అలాంటి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపరుస్తుంటాయి. సాధారణంగా దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు బాంబు దాడులు, క్షిపణులను ప్రయోగించడం చూస్తుంటాం. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇదే జరుగుతోంది. అయితే ఇది మనుషులకే పరిమితం కాదు.. మొక్కలు సైతం మిస్సైల్స్‌ను, బాంబులను ప్రయోగించగలవు. నమ్మశక్యంగా లేదా.. అయితే మీరు ఈ వీడియో చూసి తీరాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో 'వుడ్ సొరెల్' అనే మొక్క వీడియో ఒకటి షేర్ చేశారు. బెండకాయ మాదిరి ఆ మొక్కకకు కొన్ని పొడవాటి కాయలు ఉన్నాయి. ఆ కాయలను చిన్నపాటి కర్రతో టచ్ చేయగా.. వెంటనే అటువైపు నుంచి ప్రతి దాడి మొదలైంది. ఆ కాయలోని విత్తులు చాలా ఫోర్స్‌తో బయటకు వచ్చాయి. మిస్సైల్స్ లేదా బాంబులను ప్రయోగించిన తరహాలో అది కాయ నుంచి విత్తులను ఫోర్స్‌తో బయటకు పంపించింది. అంటే.. తనకేదో అపాయం జరగబోతుందని పసిగట్టిన మొక్క.. ఇలా దాడులకు దిగిందన్నమాట. 


కాయ నుంచి ఫోర్స్‌తో బయటకొచ్చిన ఆ విత్తులు కనీసం 4 మీటర్ల దూరం వరకు వెళ్తాయని చెబుతున్నారు.  ఈ వుడ్ సొరెల్ మొక్కలు ఎక్కువగా బ్రెజిల్, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల్లో కనిపిస్తాయి. ఈ మొక్క వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సుశాంత నంద.. బాలిస్టిక్ మిస్సైల్స్ కేవలం మనుషులకే పరిమితం కాదని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇప్పటివరకూ 16 వేల పైచిలుకు మంది వీక్షించారు. 



Also read: Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి


ET Telugu Official Trailer: సూర్య ET ట్రైలర్ రిలీజ్.. రాక్ సాలిడ్ గా ఉందన్న విజయ్ దేవరకొండ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook