ET Telugu Official Trailer: సూర్య ET ట్రైలర్ రిలీజ్.. రాక్ సాలిడ్ గా ఉందన్న విజయ్ దేవరకొండ!

ET Telugu Official Trailer: తమిళ నటుడు సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం 'ఈటి'. ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడయా వేదికగా రిలీజ్ చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 01:20 PM IST
  • సూర్య ET ట్రైలర్ వచ్చేసింది
  • మాస్ మూవీగా తెరకెక్కిన సినిమా
  • మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
ET Telugu Official Trailer: సూర్య ET ట్రైలర్ రిలీజ్.. రాక్ సాలిడ్ గా ఉందన్న విజయ్ దేవరకొండ!

ET Telugu Official Trailer: హీరో సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం 'ఈటి' (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). తెలుగులో ఈటీ అంటే ‘'ఎవరికీ తలవంచకు'’అని అర్థం. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. పాన్ ఇండియా మూవీ (Etharkkum Thunindhavan)గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయికగా  ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఇందులో సత్యరాజ్, జయప్రకాశ్, వినయ్‌రామ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రిలీజ్ చేశారు. 'నాకు ఇష్టమైన నటుల్లో ఒకరైన సూర్య అన్న నటించిన ఈటీ ట్రైలర్ రాక్ సాలిడ్ గా ఉంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ విజయ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ట్రైలర్ లో 'సంతోషంలో గొప్ప సంతోషం ఏమిటంటే..ఇతరులను సంతోష పెట్టడమే'',  ''కోటు వేసుకునే జడ్జి వేరే..పంచె కడితే నేనే రా జడ్జిని'' అంటూ సూర్య పలికే డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సూర్యనే స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read: Ghani Movie Release Date: వరుణ్ తేజ్ గని మూవీ విడుదల తేది ఫిక్స్.. ఈసారి పక్కా రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News