Little girl playing with cow: చాలా మంది కుక్క, పిల్లి, ఆవు, గేదె వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వీటిని ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూస్తారు. అవి కూడా మనుషుల పట్ల అంతే విశ్వాసంగా ఉంటాయి. సాధారణంగా హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తారు. పురాణాల ప్రకారం, సకల దేవతలు ఆవుల్లో కొలువై ఉంటారని నమ్ముతారు. తాజాగా ఇంట్లో పెంచుకుంటున్న ఓ ఆవు.. ఆ ఇంటి చిన్నారి పట్ల అంతులేని ప్రేమను కురిపించింది. తాజాగా దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ (Viral Video) అవుతోంది. చిన్నారి పాపను ఆవు లాలించిన విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై కామెంట్లు వర్షం కూడా కురిపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఓ ఇంటి ఆవరణలో మంచంపై ఓ చిన్నారి (child) ఆడుకుంటూ ఉంటుంది. చిన్నారి ఒక్కటే ఉండడాన్ని గమనించిన ఓ ఆవు (cow) .. వెంటనే మంచం వద్దకు వెళ్తుంది.  ఆ చిన్నారిని ప్రేమగా ముద్దుడుతూ తన ప్రేమను వర్షిస్తుంది. ఆ పాప చిరునవ్వులు చిందిస్తూ.. ఆవుతో ఆడుకుంటోంది. తాజాగా ఆవు పసి బిడ్డను లాలిస్తున్న వీడియో నెటిజన్స్ హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ వీడియోను @gopalak_jay ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజా వీడియా చాలా ముద్దుగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ఈ ఘటన నాకు ఆవులను ప్రేమించడం నేర్పిందని మరోకరు కామెంట్ చేశారు. 



Also Read: Viral Video: వావ్.. భక్తితో భజనలు చేస్తున్న శునకం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..


Also Read: Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు


సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీడియో వినూత్నంగా ఉంటే చాలు నెట్టింట ఇట్టే  వైరల్ అయిపోతుంది. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని అయితే భయపెడుతున్నాయి కూడా. ఇలాంటి వీడియోలనే ఎక్కువగా చూడటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. రోజుకు లక్షల్లో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతున్నాయి. కానీ ఇందులో కొన్ని మాత్రమే వైరల్ అవుతున్నాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook