COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dangerous video: బైక్ స్టంట్ లు చేయడానికి ఎంతో అనుభవం ఉండాలి. ప్రస్తుతం చాలామంది యువత బైక్ స్టంట్ లు చేసేందుకు ఎంతో ఆసక్తి చెబుతున్నారు ఇదే క్రమంలో స్లిప్ అవ్వడం కారణంగా బైక్ పై నుంచి పడిపోతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోలను మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. అయితే వీటన్నిటికీ భిన్నంగా బైక్ స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఏకంగా బైక్ ని అమాంతం గాల్లోకి లేపి టపాసులు పేల్చడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


వీడియో వివరాల్లోకి వెళితే.. మనం ముందుగా ఓ ఇద్దరి యువకులు స్పోర్ట్స్ బైక్ ముందు భాగంలో గాల్లో పేలే పటాసులు కట్టడం మీరు గమనించవచ్చు. ఇలా ముందు భాగంలో కట్టిన బాణాసంచాలను ఓ వ్యక్తి వెలిగిస్తాడు. ఇంతలోనే బైక్ పైన ఉన్న యువకుడు.. ఆ బైక్ ని స్టార్ట్ చేసి ఎంతో వేగంగా ముందుకు వెళుతూ.. బైకు ముందు భాగాన్ని గాల్లోకి లేపడం మీరు గమనించవచ్చు. ఇలా గాల్లోకి లేపడం వల్ల బాణాసంచాలన్ని ఒక్కొక్కటిగా గాల్లో పెద్ద శబ్దంతో పేలన మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 




Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


ఈ ఘటన తమిళనాడులోని తిరుచి జిల్లాలో జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం బైక్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, భద్రతకు హాని కలిగించడం కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఆధారంగా చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ లు చేయడం యువత ఇప్పటికైనా మానుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల బైకు నడిపే వారికి హాని కలగడమే కాకుండా ఇతరులకు కూడా హాని కలిగే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.


ఈ వీడియోను Lollubee అనే ఎక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే చాలామంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. "ఇలాంటి స్టంట్ లు రోడ్ల పైన చేయడం చాలా తప్పని, దీని కారణంగా ఇతరులకు కూడా ప్రమాదం జరుగుతుందని" అని నెటిజన్స్ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook