Viral Video: కోపిష్టి జంట... ఇంత కోపమైతే ఇక కాపురమెలా చేస్తారో.. వీడియో వైరల్..
Viral Video of bride and groom throws garlands: వాళ్లిద్దరూ కాబోయే దంపతులు... పెళ్లికి ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే వేడుకలో ఇద్దరు దండలు మార్చుకున్నారు. అయితే అదేదో శత్రువుల్లా ఇద్దరు దండులు విసిరేసుకున్న తీరు నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
Viral Video of bride and groom throws garlands: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నవారైనా.. ఈ ఫన్నీ వీడియోలను చూస్తే కొద్దిసేపైనా కాస్త రిలాక్సేషన్ ఫీల్ అవుతారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. అందులో నవ వధువు, నవ వరుడు ఒకరిపై ఒకరు కోపంగా దండలు విసురుకుంటున్నారు.
సాధారణంగా నవ వధువు, నవ వరుడు అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమ, కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న నవ వధువు, వరుడికి ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఒకరంటే ఒకరు చిర్రుబుర్రులాడుతున్నట్లే కనిపిస్తున్నారు. మొదట వధువు అతని మెడలో దండను విసిరేయగా.. ఆ తర్వాత వరుడు కూడా చిరాగ్గా ఆమె మెడలో దండ విసిరేశాడు. ఏదో కానిచ్చేశామా అంటే కానిచ్చేశాం అన్నట్లుగా ఇద్దరి ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి.
నిజానికి ఇది 'వర్మాలా' వేడుకగా చెబుతున్నారు. అంటే... పెళ్లికి ముందు వధూవరులు ఒకరంటే ఒకరికి ఇష్టమని చెబుతూ దండలు మార్చుకునే వేడుక. మరి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదో.. మరేమో గానీ ఈ ఇద్దరు మాత్రం పరమ చిరాగ్గా ఈ తంతును కానిచ్చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత యాటిట్యూడ్ పుతిన్‌కి కూడా ఉండదేమో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా కలిసుంటారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి.
Also Read: Ongole Fire Accident: ఒంగోలులో అగ్ని ప్రమాదం.. ఏడు ట్రావెల్ బస్సులు దగ్ధం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook