Sugar Sachet Trick Video: గాల్లోంచి షుగర్ తీశాడు.. మేజిక్ వైరల్ వీడియో!

Sugar Sachet Trick Video: మ్యాజిక్ వీడియోలంటే భాగా ఇష్టమా? అయితే ఈ వీడియో మీరు కచ్చితంగా చూడాల్సిందే.. ఓ వ్యక్తి షుగర్​ను ఎడమ చేతితో గాలిలోకి విసిరి.. కుడి చేతితో మళ్లీ గాలిలోంచే తీశాడు!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 10:35 PM IST
  • కళ్లను మోసం చేసే మ్యాజిక్ ట్రిక్​
  • చక్కెరను గాలిలోకి విసిరి.. మళ్లీ తీసిన మెజీషియన్​
  • సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతున్న వీడియో..
Sugar Sachet Trick Video: గాల్లోంచి షుగర్ తీశాడు.. మేజిక్ వైరల్ వీడియో!

Sugar Sachet Trick Video: మేజిక్ అంటే ఎవరు మాత్రం ఇష్టపడరూ. మన కళ్లు మననే మోసం చేసినా మనం గుర్తించలేనట్లుగా అనే మేజిక్​లు చూస్తుంటాం. అలా ఓ మేజిక్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. మిలియన్ల మంది ఆ మేజిక్ చూసి.. అసలు ఇదెలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు. చెబుతుంటే.. ఆ మేజిక్ ఏమిటో మీకు చూడాలని ఉంది కదూ? మరి ఆ మేజిక్ ఏమిటి? అందులో అంత విశేషం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా మేజిక్అంటే.. ఎక్కడో స్టేజీలపైనో.. కొంత మంది బతుకుదెరువుకోసకం ప్రదర్శిస్తుంటారు. కాని ఓ వ్యక్తం మాత్రం సరదాగా ఓ పెట్రోల్ బంక్​లో చిన్న మేజిక్ చేసీ అందరిని ఆశ్చర్య పరిచాడు.

ఓ షుగర్ ప్యాకెట్​ను తీసుకుని దానిని చింపి.. తన ఎడమ చేతి పిడికిలి బిగించి అందులో పోసుకున్నాడు. ఆ తర్వాత కుడి చేతి వేలితో దానిని లోపలికి తోసి.. గాలిలోకి విసిరాడు. అంతే ఆ పిడికి తెరిస్తే అక్కడ చక్కెర మాత్రం లేదు..

ఆ తర్వాత మళ్లీ గాలిలో నుంచే చక్కపిలుస్తున్నట్లు చేసి.. ఆ చింపిన షుగర్ ప్యాకెట్​లో చక్కెరను పోశాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.. గాలిలోకి విసిరింది ఎడమ చేతితో కాగా.. చక్కెరను తీసింది మాత్రం కుడి చేతిలోంచి. ఈ మేజిక్ చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. కళ్లముందే ఎలా అంత మాయ చేయగలిగాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను ఓవర్​టైమ్ అనే ట్విట్టర్​ పేజీ  ఈ నెల 25 షేర్ చేయగా.. ఇప్పటి వరకు 54 లక్షల మంది వీడియోను చూశారు. 30 వేల మంది రీ ట్వీట్​ చేశారు. 1.79 లక్షల మంది లైక్​ చేశారు.

Also read: Woman Dance Video: మైకెల్ జాక్సన్‌ను తలపించే బ్రేక్ డ్యాన్స్.. ఆ మహిళ టాలెంట్‌కి సోషల్ మీడియా ఫిదా

Also read: Viral Video: వధువుకి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News