Wild Elephant enters in Court: ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి కారణం మనిషి ఇష్టారీతిన అడవులను నరికి వేయడం లేదా వాటిని ఆక్రమించుకోవడం.  ఎక్కువగా పులులు, ఏనుగులు  జనావాసాల్లోకి వచ్చి పశువులపై, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ ఏనుగు ఏకంగా కోర్టులోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైగర్ రిజర్వులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కులు దగ్గరగా ఉండే గ్రామాల ప్రజలు నిత్యం భయభయంగా గడుపుతారు. ఎందుకంటే ఏ జంతువు ఎప్పుడు దాడి చేస్తుందోనని భయం. జంతువులు జనావాసాల్లోకి రాకుండా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో విధంగా తప్పించుకుంటూ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి యానిమల్స్. తాజాగా ఓ అడవి ఏనుగు ఏకంగా కోర్టులోకి వచ్చేసింది. కోర్టు గేట్ల‌ను తోసేసి, ప్రాంగ‌ణంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు భయాభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన  ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌ రోషనాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టులో చోటుచేసుకుంది. 



Also Read: Trending today: RRRలో ఎన్టీఆర్, చరణ్ ఎలా కొట్టుకున్నారో.. ఈ వీడియోలో రైనో, ఏనుగు అలా కొట్టుకున్నాయి...


ఈ అడవి ఏనుగు రాజాజీ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది కోర్టుకు వచ్చి ఏనుగును అడవిలోకి తరలించారు. ఈ సంఘటకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 


Also Read: Tiger viral video: ఇదేం పులి రా బాబు.. దాడి చేయడానికి వచ్చి హాయిగా గోడపై నిద్రపోయింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter