Watch Woman’s hair catches fire: ఒక పని చేయాలని అనుకుంటే.. ఇంకొక పని అయినప్పుడు.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని అక్కడున్న వాళ్లంతా పాత పాట అందుకోవడం మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటి ఘటనే ఇక్కడొకటి జరిగింది. మస్తు మస్తుగా బర్త్ డే కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ (Birth day party) ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఓ మహిళకు ఊహించని విధంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బర్త్ డే కేక్ కట్ చేయడానికంటే ముందుగా కేకు నిండా పేర్చి వెలిగించిన కొవ్వొత్తులను (Birth day cakes) ఆర్పే ప్రయత్నంలో ఉండగా ఆ మహిళ జుట్టుకు క్యాండిల్స్ మంట తగిలి నిప్పంటుకుంది. ఇంకేం.. అప్పటివరకు ఫుల్ సందడిగా ఉన్న ఆ బర్త్ డే పార్టీ కాస్తా అర్థాంతరంగా ఆగిపోయింది. 



Also read : Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?


అమెరికాలోని ఆగ్డెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనా ఊస్టర్‌హౌజ్ అనే 34 ఏళ్ల మహిళ.. తన 7 ఏడేళ్ల కొడుకుతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేయడానికి రెడీ అయిన సందర్భంలో ఈ ఘటన (Birthday party gone wrong) జరిగింది. ఊహించని ఘటనకు షాక్ అయిన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ వెంటనే ఆమె జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పేసి ఆమెను రక్షించారు. కానీ అప్పటికే ఆమె ఎడమవైపు జుట్టు, కనుబొమ్మలు, కను రెప్పలు కాలిపోవడంతో పాటు ముఖానికి కాలిన గాయాలు (Burns on face) అయ్యాయి.


ఈ ఘటనపై అనా స్పందిస్తూ.. నా కుటుంబం లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేదానినే కాదేమో అని చెప్పుకొచ్చింది. ఆ షాక్ లోంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టిందన్న అనా.. ఇకపై ఎప్పుడు బర్త్ డే పార్టీ చేసుకున్నా.. కేవలం రెండుకు మించి ఎక్కువ క్యాండిల్స్ ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Watch viral videos) అవుతోంది.


Also read : Air hostess dance Viral Videos: స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook