Wedding Dance Video: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రం గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. పాటలు, డైలాగులతో పాటు నటీనటుల హావభావాలు కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని 'శ్రీవల్లీ', 'ఊ అంటవా.. ఊఊ అంటావా మామా' అనే పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు సామాన్య ప్రజలను నుంచి సెలబ్రెటీల వరకు అనేక మంది ఈ పాటలకు స్పెప్పులేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని 'ఊ అంటావా' పాటకు నూతన వధూవరులు స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వధూవరులు చాలా అందంగా కనిపిస్తున్నారు. పెళ్లి సమయంలో, వధువు పెళ్లిపీటలపై నుంచి లేచి.. 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు కలిసి స్టెప్పులేశారు. వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను కెమిస్ట్రీ స్టూడియోస్ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లిలో కూడా ఈ ఐటెం సాంగ్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



Also Read: Play Pool Game: పూల్ గేమ్ ఇలా కూడా ఆడుతారా ?.. ఫన్నీ వీడియో


Also Read: Karishma Tanna Dance: సమంత సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన కొత్త పెళ్లి కూతురు, నటి కరిష్మా తన్నా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook