Wedding Viral Video: కొన్ని వీడియోలు తీసేటప్పుడు సాధారణంగానే అన్పిస్తాయి. ఒక్కోసారి ఆ సింపుల్ వీడియోలే అసాధారణంగా హిట్ అవుతుంటాయి. ఓ పెళ్లిలో పెళ్లికొడుకు రియాక్షన్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి ఓ అందమైన అనుభవం. జీవితాంతం గుర్తుంచుకోవల్సిన సంఘటన. అందుకే పెళ్లి వేడుకల్లో ప్రతి అంశాన్ని బంధించేందుకు కెమేరాలు, వీడియో షూట్స్ కీలకంగా ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనుకోని దృశ్యాలు కెమేరాలో బంధించబడి..అవికాస్తా వైరల్ అవుతుంటాయి. ఎప్పుడు ఏది హిట్ అవుతుందో తెలియదు కానీ..ఒక్కోసారి కొన్ని సింపుల్ వీడియోలు అసాధారణంగా హిట్ అవుతుంటాయి. అదే జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన ఓ అనుకోని ఘటన విషయంలో.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by WedAbout.com (@wedabout)


పెళ్లిళ్లలో సహజంగానే పెళ్లికొడుకు చూపులు కావచ్చు, హావభావాలు కావచ్చు లేదా పెళ్లికూతురి లుక్స్ లేదా ఫీలింగ్స్ కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో పెళ్లిలో బంధువుల రియాక్షన్ అందర్నీ ఆకట్టుకుంటుంటుంది. ఇటువంటివే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ వీడియోలో వధువును స్నేహితురాళ్లు వేదికపై తీసుకొస్తుంటారు. పైన వేదికపై తన స్నేహితులతో వరుడు ఆమెను రిసీవ్ చేసుకునేందుకు వేదిక మెట్ల వద్దకు చేరుకుంటాడు. ఒక్కసారిగా ఆమెను చూసి..ఫిదా అయినట్టుగా రెండు చేతులు చాచి..కిందకు పడిపోయేలా ప్రయత్నిస్తాడు. పక్కనున్న అతడి స్నేహితులు పట్టుకుంటారు. ఆ తరువాత నవ్వుకుంటూ ఆమె చేతులు పట్టుకుని తీసుకువెళ్తాడు. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది.


పెళ్లికూతురు అందానికి మైమర్చిపోయినట్టుగా, ఫిదా అయినట్టుగా అలా సింబాలిక్‌గా పడిపోతున్నట్టు పోజులిచ్చిన ఆ వరుడిపై కామెంట్లు తెగ అందుకుంటున్నారు నెటిజన్లు. అతడి హావభావాలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ క్షణం కోసం ఎన్నిరోజుల్నించి నిరీక్షిస్తున్నాడో పాపం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. వరుడి స్టైల్ చాలా అందంగా ఉందంటూ మరికొందరు కామెంట్లు చేశారు. పెళ్లిదుస్తుల్లో ఆ అమ్మాయిని చూసి షాక్ తిన్నాడని కూడా మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. అప్పుడు 80 వేల వరకూ ఈ వీడియోను వీక్షించారు.


Also read: Viral Video Fact Check: పంజాబ్‌ ఫలితాలొచ్చాకా కాబోయే సీఎం మందు పార్టీ చేసుకున్నారా ? ఆ వైరల్‌ వీడియో నిజమేనా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook