Viral Video Fact Check: పంజాబ్‌ ఫలితాలొచ్చాకా కాబోయే సీఎం మందు పార్టీ చేసుకున్నారా ? ఆ వైరల్‌ వీడియో నిజమేనా ?

Punjab Next CM Bhagwant Mann Viral Video: ''పంజాబ్‌ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్‌ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 11:22 PM IST
  • పంజాబ్‌ కాబోయే సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి తూలుతున్నట్టు వీడియో వైరల్
  • ''పంజాబ్‌ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌'' అంటూ కథనాలు వైరల్
  • పంజాబ్ ఎన్నికల ఫలితాల తర్వాతిదిగా చెబుతున్న ఈ వైరల్ వీడియోలో నిజమెంత ఉంది ?
Viral Video Fact Check: పంజాబ్‌ ఫలితాలొచ్చాకా కాబోయే సీఎం మందు పార్టీ చేసుకున్నారా ? ఆ వైరల్‌ వీడియో నిజమేనా ?

Punjab Next CM Bhagwant Mann Viral Video: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించి అధికారపీఠాన్ని చేజిక్కించుకుంది. ఆప్‌ గెలిస్తే తమ పార్టీ నేత భగవంత్‌మాన్‌ను ముఖ్యమంత్రి చేస్తామని ఆ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ముందే ప్రకటించారు. అయితే, పంజాబ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
''పంజాబ్‌ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్‌ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది. 

Zee Telugu News Fact check - జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్‌ చెక్‌ :
ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఇన్‌విడ్‌ టూల్‌ ద్వారా సేకరించి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో వెతికితే దీనికి సంబంధించిన పాత లింకులు బయటపడ్డాయి. వాస్తవానికి ఈ దృశ్యం 2019 సాధారణ ఎన్నికలకు ముందు రికార్డ్‌ చేసినది. గూగుల్‌లో కీ వర్డ్స్‌ ఆధారంగా సెర్చ్‌ చేస్తే ఈ వీడియో 2017కు సంబంధించినదన్న ఆధారాలు దొరికాయి. భగవంత్‌మాన్‌ ఫుట్‌పాత్‌ దిగి తన కారు దగ్గరికి వెళ్లే సమయంలో జారిపడబోయారు. అక్కడున్నవాళ్లు ఆయన్ను జాగ్రత్తగా కారులో ఎక్కించారని వార్తాకథనాలు పేర్కొన్నాయి. అంటే ఇది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం. 

ప్రచారం :
పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మద్యం మత్తులో ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మాన్‌.

వాస్తవం :
ఇది 2019 సాధారణ ఎన్నికలకు ముందు రికార్డ్ చేసిన వీడియో. ఇటీవల ఎన్నికల తర్వాత దృశ్యమంటూ తప్పుదారి పట్టిస్తున్నారు.

Also read : Maggi Gets Costlier: టీ, మ్యాగీ ప్రియులకు షాక్.. ధరలను పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్!

Also read : Washing Machine Offers: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.7 వేల బడ్జెట్ లో అమ్మకానికి వాషింగ్ మెషీన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News